వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Donald Trump: ఫేస్ బుక్ షాక్, సార్..... మీరు చూసుకోవచ్చు, చెయ్యకూడదు, రెండేళ్లు బ్లాక్ లిస్టులో !

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయించిన డోనాల్డ్ ట్రంప్ రాబోయే రెండేళ్ల పాటు ఫేస్ బుక్ లో ఆయన మనోభావాలు పంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మీరు ఫేస్ బుక్ కు చేసిన సేవలు ఇక చాలు, రెండు సంవత్సరాల పాటు మీ సేవలు మాకు అవసరం లేదు అంటూ ఫేస్ బుక్ యాజమాన్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించింది. అమెరికా క్యాపిటల్ కట్టడం మీద జనవరి 6వ తేదీ దాడులు జరగకముందు డోనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడం, ఆ పోస్టులు అల్లర్లు వ్యాపించడానికి కారణం అయ్యిందని ఫేస్ బుక్ యాజమాన్యం అప్పట్లోనే ఆరోపించింది. ఇక ముందు ట్రంప్ ఫేస్ బుక్ చూసుకోవచ్చు, ఆయన పోస్టులు చెయ్యడానికి అవకాశం లేదని ఫేస్ బుక్ యాజమాన్యం తేల్చి చెప్పింది.

Lover: పెళ్లి కూతురి ఇంటికి లేడీ గెటప్ తో ప్రియుడు, ఊడి వచ్చేసిన విగ్, సినిమా స్టైల్లో, గూబ గుయ్ !Lover: పెళ్లి కూతురి ఇంటికి లేడీ గెటప్ తో ప్రియుడు, ఊడి వచ్చేసిన విగ్, సినిమా స్టైల్లో, గూబ గుయ్ !

 ఒక్క పోస్టు డోనాల్డ్ ట్రంప్ కొంప ముంచింది

ఒక్క పోస్టు డోనాల్డ్ ట్రంప్ కొంప ముంచింది

జనవరి 6వ తేదీన అమెరికా క్యాపిటల్ కట్టడం మీద దాడులు జరగడంతో ఆ దేశంలో అల్లర్లు వ్యాపించి హింస చోటు చేసుకుంది. అమెరికా క్యాపిటల్ మీద దాడులు జరగక ముందే ఆ విషయాలపై అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేశారు. డోనాల్డ్ ట్రంప్ పోస్టు కారణంగా అమెరికాలో హింస చోటు చేసుకుందని ఫేస్ బుక్ యాజమాన్యం అప్పట్లో ఆరోపించింది.

 జస్ట్ రెండు సంవత్సరాలు బ్లాక్ లిస్ట్

జస్ట్ రెండు సంవత్సరాలు బ్లాక్ లిస్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ యాజమాన్యం భారీ షాక్ ఇచ్చింది. జనవరిలో ట్రంప్ ఫేస్ బుక్ అకౌంట్ ను ఆరు నెలల పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. ఇప్పుడు మరోసారి 2023 జనవరి వరకు ఆయన అకౌంట్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నామని ఫేస్ బుక్ యాజమాన్యం స్పష్టం చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్ అకౌంట్ ను సస్పెండ్ చెయ్యడాన్ని చాలా మంది నాయకులు, ప్రజలు స్వాగతిస్తున్నారు.

 ట్రంప్ చూసుకోవచ్చు అంతే...... చెయ్యకూడదు

ట్రంప్ చూసుకోవచ్చు అంతే...... చెయ్యకూడదు

ఫేస్ బుక్ పోస్టులు చూసుకోవడానికి మాత్రమే డోనాల్డ్ ట్రంప్ కు అవకాశం ఉంది. తన ఫేస్ బుక్ అకౌంట్ లో రెండు సంవత్సరాల పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక్కపోస్టు కూడా పోస్టు చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో గతంలో అనేక పోస్టులు చేసి ప్రపంచ దేశాల ప్రజలను ఆకర్షించిన డోనాల్డ్ ట్రంప్ రెండేళ్ల వరకు ఫేస్ బుక్ జస్ట్ హాయ్ అని పోస్టు చెయ్యడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

 రికార్డు బద్దలు కొట్టిన ట్రంప్

రికార్డు బద్దలు కొట్టిన ట్రంప్

అనేక దేశాల ప్రధానులు, మాజీ ప్రధానులు, దేశాధ్యక్షులు, మాజీ అధ్యక్షులను ఫేస్ బుక్ బ్లాక్ లిస్టులో పెట్టడం ఇదే మొదటి సారి. గతంలో ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించిన డోనాల్డ్ ట్రంప్ రెండేళ్ల పాటు ఫేస్ బుక్ నిషేధానికి గురి కావడంతో రికార్డు సృష్టించారు. ఫేస్ బుక్ తీరును చాలా మంది నాయకులు, అనేక దేశాల రాజకీయ నాయకులు స్వాగతిస్తున్నారు. అయితే అమెరికా రిపబ్లికన్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ న్యాయనిపుణలు మాత్రం ఫేస్ బుక్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 డ్యాన్స్ చేస్తున్న ప్రత్యర్థులు

డ్యాన్స్ చేస్తున్న ప్రత్యర్థులు

మేము ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, మాకు వ్యక్తిగతంగా ఎవరిమీద కక్ష లేదని ఫేస్ బుక్ సంస్థ సీనియర్ అధికారి నిక్ క్లేగ్ ఆయన బ్లాగ్ లో పోస్టు చేశారు. మొత్తం మీద అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్ అకౌంట్ రెండు సంవత్సరాల పాటు బ్లాక్ లిస్టులోకి వెళ్లిపోవడంతో ఆయన తీరును వ్యతిరేకిస్తున్న వాళ్లు ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నారు.

Recommended Video

New IT Rules : Facebook తగ్గినా WhatsApp Court Plea | Indian Government || Oneindia Telugu

English summary
Donald Trump: Facebook on Friday suspended former US President Donald Trump from its platform until at least January 2023 in a decision that has been watched closely for signals on how the company will treat rule-breaking world leaders in the future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X