యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!
మధ్యప్రాచ్యంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న భీకర యుద్ధ వాతావరణంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఇరాన్‌లోని ఇంధన, చమురు క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా జరుపుతున్న దాడులను 10 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం స్వయంగా చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ.. దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొంత మేర తగ్గనున్నట్లు అంచనాలు నెలకొంటున్నాయి.
ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. "ఇరాన్ ప్రభుత్వం కోరినట్లుగా.. వారి ఇంధన వనరులను ధ్వంసం చేసే చర్యలను వాయిదా వేస్తున్నాను. ఈ గడువు ఏప్రిల్ 6, 2026 (సోమవారం) రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు చాలా సానుకూల వాతావరణంలో సాగుతున్నట్లు.. దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయని డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

యుద్ధం నుంచి తాత్కాలిక ఊరట
గత కొన్ని వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆ దేశ చమురు నిల్వలపై విరుచుకుపడుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో 10 రోజుల విరామం అనేది ఓ కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది శాశ్వత యుద్ధ విరామానికి దారితీస్తుందా లేక కేవలం ఉద్రిక్తతలను తగ్గించే తాత్కాలిక ప్రయత్నమేనా అనేది ఏప్రిల్ 6 తర్వాతే తెలుస్తుంది.
ఇరాన్ పంపిన విలువైన గిఫ్ట్
ఈ శాంతి దిశగా అడుగులు పడటానికి ప్రధాన కారణం ఇరాన్ పంపిన ఓ విలువైన బహుమతి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా 10 చమురు ట్యాంకర్లు సురక్షితంగా వెళ్లేందుకు ఇరాన్ అనుమతిని ఇచ్చింది. వీటిలో కొన్ని పాకిస్థాన్ జెండాతో ఉన్న ట్యాంకర్లు కూడా ఉన్నాయని సమాచారం. తొలుత 8 ట్యాంకర్లకే అనుమతి ఇస్తామని ఇరాన్.. చర్చల అనంతరం ఆ సంఖ్యను 10కి పెంచిందని.. ఆ సహకారం వల్ల చర్చలు మరింత ముందుకు సాగుతాయని వైట్ హౌస్ కేబినెట్ సమావేశంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వివరించారు.
-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి?












Click it and Unblock the Notifications