ట్రక్కు డ్రైవర్ గా ట్రంప్, కారణమిదే

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తాడు.వైట్ హౌజ్ ముందుకు పార్క్ చేసిన ట్రక్కులోకి ఎక్కి సందడి చేశారు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ట్రక్కు నడుపుతున్న పోటోలు బయటకు రావడంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు చేశారు.

గురువారం నాడు ట్రక్కు డ్రైవర్లు ఆ రంగానికి చెందిన ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ట్రాక్టర్ ట్రైయిలర్ వాహనంలోకి ఎక్కిన ట్రంప్ కొద్ది నిమిషాలపాటు సందడి చేశారు.

donald trump has a truck driver moment, twitter goes into overdrive

డ్రైవర్ సీటులో కూర్చుకొని ముందుకుగా హారన్ మొగించాడు. స్టీరింగ్ పట్టుకొని తనదైనశైలిలో హావభావాలు పలికించారు. ట్రక్కు డ్రైవర్లకు తెలిసినంతగా ఆమెరికా గురించి తనకు తెలియదు.

రోజూ ట్రక్కు డ్రైవర్లు కొండలు, లోయలు చూస్తారు.రోడ్లపై పూడ్చాల్సిన ప్రతి గొయ్యిను పరిశీలిస్తారని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డ్రైవర్ అవతారం ఎత్తిన ట్రంప్ ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ట్విట్టర్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.దీంతో నెటిజన్లు సరదగా కామెంట్లు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
america President donald trump was rallying votes for his health care reform bill Thursday but made a pit stop in the afternoon to meet with truck drivers and trucking executives.
Please Wait while comments are loading...