వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ వర్సెస్ హిల్లరీ: ఒక్కసారిగా రివర్స్ అయింది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఈ మెయిల్స్ షాక్ తగిలింది. నిన్నటి దాకా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే చాలా ముందున్న హిల్లరీ.. ఇప్పుడు కొద్దిగా మాత్రమే ముందంజలో ఉన్నారు. ఈ మెయిల్స్ వ్యవహారం ఆమెకు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి.

భారత్‍‌లా మనకు సాధ్యం కాదా, అంతా హిల్లరీ వల్లే: ట్రంప్

ఎఫ్‌బీఐ దర్యాప్తు హిల్లరీకి గుదిబండలా మారిందని చెప్పవచ్చు. పలు దిన పత్రికలు నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణల్లో ఇప్పటి వరకు హిల్లరీ... ట్రంప్ పైన స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎప్పుడైతే ఈ-మెయిల్స్‌ వ్యవహారాన్ని మళ్లీ విచారిస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించిందో అప్పటి నుంచి క్రమంగా పడిపోతోంది.

రెండు రోజుల్లో ఆమెకి ట్రంప్‌కు మధ్య తేడా ఒక శాతానికి పడిపోయింది. ఆదివారం ఏబీసీ, వాషింగ్టన్‌ పోస్టులు నిర్వహించిన సర్వేల్లో క్లింటన్‌కు 46శాతం, ట్రంప్‌కు 45శాతం మద్దతు లభించింది. న్యూయార్క్‌ టైమ్స్‌, సినా కాలేజ్‌ రీసెర్చి సెప్టెంబరులో నిర్వహించిన సర్వేలో ఫ్లొరిడా రాష్ట్రంలో ఒక పాయింట్ వెనుకబడి ఉన్న ట్రంప్‌ ఇప్పుడు ఏకంగా నాలుగు పాయింట్ల ఆధిక్యానికి దూసుకెళ్లారు.

Donald Trump Just 1 Point Behind Hillary Clinton In Latest Poll

ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు క్లింటన్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆమె ఆదివారం ఒక్క రోజే మియామీ, ఫోర్టు లౌడర్‌డేల్‌లో ఐదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మరోవైపు, తాజా పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు ట్రంప్‌ పావులు కదుపుతున్నారు. నెవాడా, కొలొరాడో, న్యూమెక్సికో రాష్ట్రాల్లో ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా లాస్‌వేగాస్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.

హిల్లరీ నేరపూరిత చర్యలన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవే అన్నారు. వరికీ తెలియకుండా కొన్ని లక్ష్యాలతో చేశారని ఆరోపించారు. కాగా, అసభ్యకర ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న ట్రంప్‌కు ఎఫ్‌బీఐ ప్రకటన ఊరటనిచ్చింది. ఒక్కసారిగా హిల్లరీకి ఈ మెయిల్స్ వ్యవహారం రివర్స్ అయింది.

English summary
Donald Trump Just 1 Point Behind Hillary Clinton In Latest Poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X