ట్రంప్ సంచలన నిర్ణయం: వ్యాపార వ్యవహారాలకు 'గుడ్ బై'

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: త్వరలోనే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించబోతున్న అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడిగా పూర్తి స్థాయి సమయం వెచ్చించడం కోసం తన బిజినెస్ వ్యవహారాల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

అధ్యక్షుడిగా వ్యక్తిగత వ్యవహారాల కంటే అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని అందుకే వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ట్రంప్ తేల్చేశారు.

మీలాగే మేం: ట్రంప్‌కు లేఖ, షాకిచ్చిన ఐబీఎం ఉద్యోగిని

వ్యక్తిగత వ్యాపారాలను చక్కదిద్దుతూ అధ్యక్ష పదవిని చేపట్టడం సమంజసం కాదన్న విమర్శల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

 Donald Trump

ఇకనుంచి తన వారసులే వ్యాపార వ్యవహారాలను చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. వ్యాపారం కన్నా అమెరికా అభివృద్ధే ముఖ్యమని.. వ్యాపార బాధ్యతలను వారసులకు బదిలీ చేసే డాక్యుమెంట్లు సిద్దం చేసే పనిలో ప్రస్తుతం ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి డిసెంబర్15న అధికారిక ప్రకటన చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ట్రంప్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump has announced he is leaving his "great" business empire “in total” ahead of taking the reins as America’s 45th President.
Please Wait while comments are loading...