చైనా సాక్షిగా! మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం, ఏమన్నారంటే..?

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఆసియా ఫసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్(అపెక్) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధి పథంలో భారత్‌ దూసుకెళ్లేలా పరిపాలన చేస్తున్నారంటూ కొనియాడారు.

ఏకతాటిపైకి తెచ్చారు..

ఏకతాటిపైకి తెచ్చారు..

130 కోట్ల భారత ప్రజలను ఏకతాటిపై తెచ్చారనీ ట్రంప్ ప్రశంసించారు. అంతేగాక, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారని కీర్తించారు.

అభివృద్ధికి కృషి..

అభివృద్ధికి కృషి..

ప్రస్తుతం ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్.. వియాత్నాం వేదికగా జరుగుతున్న ఆసియా ఫసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్(అపెక్) సదస్సులో ప్రసంగించారు. ఏపెక్ కూటమిలో లేని దేశాలు కూడా ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి అవుతున్నదని, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని మోడీ బాగా పనిచేస్తున్నారని అన్నారు.

చైనా ప్రతినిధుల ముందే..

చైనా ప్రతినిధుల ముందే..

చైనా ప్రతినిధుల ముందే భారత ప్రధాని మోడీపై ప్రసంశల జల్లు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి సాధిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అదే నాకు నచ్చే అంశం

అదే నాకు నచ్చే అంశం

చాలా విజయవంతంగా మోడీ దూసుకెళ్లుతున్నారని ట్రంప్ తన సందేశంలో తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశంతోనైనా వాణిజ్య సంబంధాలు పెట్టుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. భారతీయులు సోదరభావం కలిగి ఉంటారని అదే భారత ప్రజల్లో తనకు నచ్చే అంశమని ఆయన అన్నారు. ఆగష్టు నెలలో మోడీ తనతో సమావేశమైనప్పుడు కూడా అదే సోదరభావాన్నే వ్యక్త పరిచారని గుర్తుతెచ్చుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump praised India's "astounding" growth after it opened its economy and also lauded Prime Minister Narendra Modi, saying he has been working successfully to bring the vast country and its people together.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి