వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు పెళ్లిళ్లు, కంపు వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కోటి మంది వలసదారులను అమెరికా నుంచి వెళ్లగొడతానని, ముస్లింలు అమెరికా రాకుండా తాత్కాలికంగా నిషేధిస్తామని, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని... ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరూ చేయని విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకు పోతున్నారు.

అసలు ఎవరీ డోనాల్డ్ ట్రంప్. వ్యాపారవేత్త, టెలివిజన్ సెలబ్రిటీ, పుస్తక రచయిత, రాజకీయ వేత్త ఇలా ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి. విలాసవంతమైన జీవితానికి మారుపేరు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో, వినోద వ్యాపారంలో రారాజుగా పేరు పొందారు. 1885లో ట్రంప్‌ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు.

ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ వ్యాపారవేత్త. న్యూయార్క్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. జూన్ 14, 1946న న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో జన్మించారు. కాలేజీలో చదువుకుంటూనే తన తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారంలో ట్రంప్ మెళకువలు నేర్చుకున్నాడు.

1968లో వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్ధికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ట్రంప్‌ గ్రూప్‌తో పాటు ట్రంప్‌ ఎంటర్‌టైనమెంట్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థకు ఆయన సీఈఓగా నియమితులయ్యారు. ట్రంప్‌ది ముక్కుసూటి తత్వం. మూడు సార్లు వివాహం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఐదుగురు పిల్లలు.

ఎవరేం అనుకున్నా తనకు నచ్చినట్లుగానే ఉంటారు. 60 ఏళ్ల వయసులో రియాలిటీ షో 'ది అప్రంటిస్‌' నిర్వహించి అమెరికన్ల దృష్టిని ఆకర్షించారు. అమెరికాలో ఈ టీవీ షో ఓ సంచలనం. దీంతోనే ఆయన ఓ సెలబ్రిటీగా మారిపోయారు. డబ్బు సంపాదన కోసం అందాల పోటీలు నిర్వహించే వారు.

తాను రచించిన పలు పుస్తకాలకు ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. వ్యాపార రంగంలో విజయాలతో పాటు అపజయాలను సైతం ఎదుర్కొన్నారు. 25 ఏళ్లలో క్యాసినో వ్యాపారంలో ఐదు సార్లు దివాళా తీశారు. న్యూస్‌వీక్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బ్యాంకు చట్టాలతో ఆడుకోవడం నాకు సరదా' అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం అనేక

అంతేకాదు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం అనేక


అడ్డదారులను సైతం తొక్కారు. 1987-99 సంవత్సరాల మధ్య రిపబ్లికన పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత ఇండిపెండెంట్‌, రిఫార్మ్‌ పార్టీల్లో కీలక పాత్ర పోషించారు.

 మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?


1988, 2004, 2012 ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడే ఆలోచన చేశారు కానీ బరిలోకి మాత్రం దిగలేదు. 2006, 2014 లో రెండుసార్లు న్యూయార్క్‌ గవర్నర్‌గా బరిలోకి దిగేందుకు విఫలయత్నం చేశారు.

 మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?


2011లో ఒబామా పౌరసత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీ తరుపున ప్రైమరీ ఎన్నికల్లో వరుస విజయాలను ట్రంప్ సాధించారు.

 మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

మంగళవారం జరిగిన ఫ్లోరిడా, ఇల్లినాయిస్‌, నార్త్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. దీంతో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం పొందడానికి 1,237 డెలిగేట్స్ మద్దతు ట్రంప్‌కు దాదాపుగా లభించినట్టే.

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

అయితే, అమెరికా ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రంగా ఉన్న ఓహిలో మాత్రం ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. ఈ క్రమంలో రిపబ్లికన్‌ పార్టీ తరపున ట్రంప్‌కు అభ్యర్థిత్వాన్ని నిరాకరించే అవకాశముందని తెలుస్తోంది.

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

ఈ నేపథ్యంలో సీఎన్ఎన్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ట్రంప్ మాట్లాడుతూ తనకు లక్షలాది మంది ప్రజలు మద్దతు ఉందని, తనకు అభ్యర్థిత్వాన్ని కేటాయించకపోతే, పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతాయని హెచ్చరించారు.

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

మూడు పెళ్లిళ్లు, వివాదస్పద వ్యాఖ్యలు: ఎవరీ ట్రంప్?

అమెరికాను ప్రపంచపటంలో తిరిగి అగ్రస్థానంలో నిలుపుదాం అనే నినాదంతో ప్రస్తుత ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

English summary
Republican presidential frontrunner Donald Trump has warned of riots if he is denied the party's presidential nomination for the November 8 United States election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X