మెక్సికో పేరు మార్చాల్సిందే.. ట్రంప్ సంచలన డిమాండ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన డిమాండ్‌తో తెరపైకి వచ్చారు. అమెరికాలోని 'న్యూ మెక్సికో' రాష్ట్రాన్ని వెంటనే 'న్యూ అమెరికా'గా మార్చాలని ఆయన పట్టుబట్టారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ఆయన, మనం మెక్సికో కాదు.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని స్పష్టం చేశారు. ఈ పేరు మార్పు ద్వారా రాష్ట్రానికి ఎంతో గౌరవంతో పాటు విలువ పెరుగుతుందని, అక్కడి ప్రజల ఇళ్ల ధరలు, ఆదాయాలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌లోనూ ఇలాంటి ప్రతిపాదనే తెచ్చిన ట్రంప్, ఇప్పుడు దానిని మరింత గట్టిగా తెరపైకి తీసుకొచ్చారు.

అమెరికా రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కేవలం అధ్యక్షుడి ఆదేశాలతోనే ఏ రాష్ట్రం పేరైనా మార్చడం సాధ్యం కాదు. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే ఆ రాష్ట్ర రాజ్యాగంలో సవరణ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనికి అక్కడి రాష్ట్ర శాసనసభ ఆమోదంతో పాటు ఓటర్ల అంగీకారం కూడా తప్పనిసరి. అయితే ట్రంప్ ప్రతిపాదనపై న్యూ మెక్సికో రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. డెమోక్రటిక్ గవర్నర్ మిచెల్ లుజాన్ గ్రిషమ్ ఈ డిమాండ్‌ను పూర్తిగా తోసిపుచ్చారు. న్యూ మెక్సికో దేశం ఏర్పడటానికి వందల సంవత్సరాల ముందే ఈ ప్రాంతానికి 'న్యూవో మెక్సికో' అనే పేరు ఉందని ఆమె గుర్తుచేశారు. చివరికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులు కూడా రాష్ట్ర సంస్కృతి, పేరు మార్పు చర్చకు తావులేదని స్పష్టం చేశారు.

Donald Trump Renews Call to Rename New Mexico as New America Sparking Backlash from State Leaders
అనూహ్యంగా వేగం పుంజుకున్న తుఫాన్.. పెను విధ్వంసం తప్పదా?
అనూహ్యంగా వేగం పుంజుకున్న తుఫాన్.. పెను విధ్వంసం తప్పదా?

భౌగోళిక పేర్ల మార్పుపై ట్రంప్ దూకుడు.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భౌగోళిక పేర్లను మార్చడమే లక్ష్యంగా ట్రంప్ వరుస అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే 'గల్ఫ్ ఆఫ్ మెక్సికో'ను 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా, లేక్ ఒంటారియోను 'లేక్ అమెరికా'గా మార్చాలని గతంలోనే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అమెరికా గొప్పతనాన్ని చాటేలా చారిత్రక పేర్లను పునరుద్ధరిస్తున్నామని ఆయన సమర్థించుకుంటున్నారు. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన డెనాలీని తిరిగి 'మౌంట్ మెకిన్లీ'గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

శతాబ్దాల నాటి శాపం! కుంగిపోతున్న మహా నగరం
శతాబ్దాల నాటి శాపం! కుంగిపోతున్న మహా నగరం

సముద్రాల పేర్లు కూడా మారుస్తానంటూ మరో ప్రతిపాదన

కేవలం రాష్ట్రాలు, జలాశయాల పేర్లే కాకుండా అమెరికాను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ లేదా పసిఫిక్ మహాసముద్రాలలో ఏదో ఒకదానికి 'ట్రంప్ ఓషన్' లేదా 'ఓషన్ ఆఫ్ ది అమెరికాస్' అని పేరు పెడితే బాగుంటుందని టెన్నెస్సీ రాష్ట్రంలో జరిగిన సభలో ట్రంప్ అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడి వరుస నామకరణాల ప్రతిపాదనలు ప్రస్తుతం అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+