హైదరాబాద్ లో మరో పోలీస్ కమిషనరేట్ ఆఫీస్: 22 పోలీస్ స్టేషన్లు, 6 అసెంబ్లీలు దీని పరిధిలో

భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్‌ మేనేజ్‌మెంట్ నూతన క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ వ్యయం 200 కోట్ల రూపాయలు. ఈ భారీ అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ క్యాంపస్ కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో మొత్తం 20 ఎకరాల స్థలాన్ని ఇదివరకే కేటాయించింది. రెండేళ్ల కాలంలో ఇది పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి.

నూతన క్యాంపస్

నిజానికి 2009 లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ కింద ఎంపికైనప్పటికీ ఈ అర్బన్ మేనేజ్మెంట్ క్యాంపస్, భవన సముదాయానికి ప్రభుత్వం భూమి కేటాయించ లేదు. ఈ కారణంగా ఇంతకాలం ఎప్పటికప్పుడు ఇది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించింది.. రేవంత్ ప్రభుత్వం. తెలంగాణలో అర్బన్ టౌన్ ప్లానింగ్ విధానాల రూపకల్పన, పరిశోధనా కేంద్రంగా ఈ ఇన్ స్టిట్యూట్ కీలకంగా వ్యవహరించబోతోంది.

CM Revanth Reddy inaugurated the newly established Future City Police Commissionerate in Ibrahimpatnam

2028 జూన్ 2 నాటికి

2028 జూన్ 2 నాటికి ఈ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ ఏడాది నిర్వహించబోయే0 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. నిధులకు ఇబ్బందులేమీ లేవని, పనులు ఎక్కడా ఆగకూడదని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలు, పరిసర ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ పరిధిలో మరో పోలీస్ కమిషనరేట్ అందుబాటులోకి వచ్చినట్టయింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లు అందుబాటులో ఉంటోన్న విషయం తెలిసిందే. ఇప్పుడిక నూతనంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కూడా మనుగడలోకి వచ్చింది.

CM Revanth Reddy inaugurated the newly established Future City Police Commissionerate in Ibrahimpatnam

కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధులను పునర్వ్యవస్థీకరించి ఈ నూతన వ్యవస్థను రూపుదిద్దారు. మొత్తం ఆరు శాసనసభ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. పాలనా సౌలభ్యం, శాంతిభద్రతల సమర్థవంతమైన నిర్వహణ కోసం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిని మూడు ప్రధాన శాంతిభద్రతల జోన్లుగా వర్గీకరించారు.

22 పోలీస్ స్టేషన్లు

మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల జోన్లుగా విభజించిన ఈ ప్రాంతంలో మొత్తం 22 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, నాలుగు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 2001 సంవత్సరం నుంచి జనాభా పెరుగుదల రేటు 48.16 శాతంగా నమోదవ్వగా, రాబోయే 2030 నాటికి ఇక్కడ నివసించే వారి సంఖ్య దాదాపు 25 నుంచి 30 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 19,333 ఎకరాల భారీ ప్రాజెక్టులు ఫ్యూచర్ సిటీలో రాబోతోన్నందున ఇక్కడ ఈ కమిషనరేట్ అవసరమని ప్రభుత్వం భావించింది.

సీసీఎస్ తో పాటు సైబర్ క్రైమ్స్ ప్రత్యేక విభాగం ఈ ఫ్యూచర్ సిటీ కమిషరేట్ పరిధిలో ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థను దీని పరిధిలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. డీజీపీ సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ జోషీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+