నోరు మూస్తావా: మహిళా రిపోర్టర్‌పై అరిచిన ట్రంప్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకుంటాడనే విమర్శలు ఉన్నాయి. తాజాగా, మరోసారి అతను నోరు పారేసుకున్నాడు. ఈసారి ఓ రిపోర్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నా కంటే ఆమే గొప్ప: ఒబామా, చరిత్ర సృష్టించిన హిల్లరీ

ఫ్లోరిడాలో అతను మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళా జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు అతను అసహనానికి లోనయ్యాడు. కొంచెం నోరు మూస్తావా అని ఆమె పైన మండిపడ్డాడు. ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుండగానే అతను అలా మాట్లాడాడు.

Donald Trump Tells NBC Reporter 'Be Quiet'

ఎన్బీసీ మహిళా రిపోర్టర్ కేటీ.. అమెరికాకు చెందిన వ్యక్తిది ఎవరిదైనా కంప్యూటర్‌ను హ్యాక్ చేయమని రష్యా లేదా చైనాను అడిగేందుకు మీకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించింది.

ట్రంప్ దానికి సమాధానం దాట వేశాడు. అయినా వదలని సదరు రిపోర్టర్ కేటీ.. హిల్లరీ ఈ మెయిల్స్ హ్యాక్ చేయాలని ట్రంప్ అన్న మాటలను గుర్తుకు గుర్తు తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 'బీ క్వైట్' అని అరిచారు. దీంతో ఆమె మౌనం దాల్చారు. కాగా, హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె పంపిన ఈ మెయిల్స్ కొన్ని అదృశ్యం కాగా, వాటిని కనిపెట్టేందుకు రష్యా సాయం చేయాలని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump told a reporter to “be quiet” on Wednesday after she pressed the Republican nominee over his assertion that he hopes the Russians have Hillary Clinton’s emails.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి