గర్భిణులకు ట్రంప్ షాక్: పారాసెటమాల్‌తో ఆటిజం ముప్పు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మరో వివాదాస్పద కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఉపయోగించే నొప్పి నివారణ మందు 'టైలెనాల్' వాడితే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. అత్యవసరమైచే తప్ప ఈ మందును వాడొద్దని గర్భిణీ స్త్రీలకు సూచించారు. ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రకారం.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా గర్భధారణలో పారాసెటమాల్ వాడకం వల్ల ఆటిజం ప్రమాదం పెరుగుతుందని వైద్యులకు తెలియజేయనుందని తెలిపారు. అయితే ఈ ప్రకటనలపై వైద్య నిపుణులు, సైంటిస్టులు ఎలా స్పందించారో తెలుసుకుందాం.
టైలెనాల్ అంటే ఏమిటి?
టైలెనాల్ అనేది పారాసెటమాల్ అనే ఔషధం బ్రాండ్ పేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా నొప్పి, జ్వరం తగ్గించడానికి ఎక్కువగా వినియోగించబడుతుంది. గర్భధారణ సమయంలో ఐబుప్రోఫెన్ వంటి ఇతర మందుల కంటే ఇది సురక్షితమైనదిగా వైద్యులు సూచిస్తారు. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గర్భిణీ స్త్రీలు దీన్ని ఉపయోగించారు.

ఆటిజం అంటే ఏమిటి?
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ASD) అనేది ఒక న్యూరోడెవలప్‌మెంటల్ పరిస్థితి. ఇది ఓ వ్యక్తి ఇతరులతో ఎలా కమ్యూనికేట్ చేస్తాడు. ఎలా వ్యవహరిస్తాడు. ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తాడనే దానిపై ప్రభావం చూపుతుంది. ఆటిజం అనేది ఒక 'స్పెక్ట్రమ్' అని పిలవబడుతుంది. ఎందుకంటే ఇది వ్యక్తుల మధ్య చాలా తేడాలు ఉండే వివిధ రకాల బలాలు, సవాళ్లను కలిగి ఉంటుంది.
సైంటిఫిక్ ఆధారాలు ఏం చెబుతున్నాయి?
గత దశాబ్ధంలో కొన్ని పరిశోధనలు పారాసెటమాల్ వాడకం, ఆటిజం మధ్య సంబంధం ఉండవచ్చని సూచించాయి. కానీ దీనిపై సంబంధం ఉందంటే కచ్చితంగా కారణమవుతుందని అర్థం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు 2019లో జరిగిన ఓ అధ్యయనం గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడిన తల్లుల పిల్లల్లో ఆటిజం సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే దీనికి మందు తీసుకున్న కారణాలు (ఉదాహరణకు జ్వరం, ఇన్‌ఫెక్షన్) కూడా కారణం కావచ్చని పరిశోధకులు సూచించారు. కానీ 2024లో స్వీడన్‌లో 25 లక్షల మంది పిల్లలపై జరిగిన ఒక అధ్యయనంలో, పారాసెటమాల్ వాడకం వల్ల ఆటిజం, ADHD లేదా ఇతర సమస్యలు పెరగలేదని తేలింది.
వైద్య నిపుణులు ఏమంటున్నారు?
అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వంటి వైద్య సంస్థలు గర్భధారణ సమయంలో అవసరమైనప్పుడు పారాసెటమాల్ వాడకం సురక్షితమని పేర్కొంటున్నాయి. చికిత్స చేయని జ్వరం, నొప్పి వంటివి గర్భస్థ శిశువుకు మరింత ప్రమాదం కలిగించవచ్చని వారు చెబుతున్నారు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ అండ్ రోజ్ వాక్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ సుందర్ మాట్లాడుతూ.. పారాసెటమాల్, ఆటిజం మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని చెప్పారు. "ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఇలాంటి నివేదికలు ఏవీ లేవు. నేను 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. నేను నా గర్భిణీ రోగులకు పారాసెటమాల్ రాసిచ్చాను. 103 డిగ్రీల జ్వరం శిశువుకు మరింత ప్రమాదకరం. అందువల్ల జ్వరం తగ్గించుకోవడానికి పారాసెటమాల్ తీసుకోవడం మంచిది. అయితే, గర్భధారణలో వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు" అని ఆమె సూచించారు.
టైలెనాల్ బ్రాండ్‌ను సొంతం చేసుకున్న కెన్వ్యూ సంస్థ కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. "పారాసెటమాల్ వల్ల ఆటిజం వస్తుందన్న వాదనను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. శాస్త్రీయ ఆధారాలు ఈ వాదనకు మద్దతు ఇవ్వడం లేదు" అని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల గర్భిణీ స్త్రీలు సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది.
-
ఆ నినాదంతో బలంగా.. ట్రంప్ బాటలో కవిత! -
Botsa Satyanarayana: బొత్సకు మళ్లీ అస్వస్ధత-మండలిలో మాట్లాడుతూనే..! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్












Click it and Unblock the Notifications