ఆప్ఘన్ మసీదు వద్ద పేలుడు.. 50 మంది మృతి, పలువురికి గాయాలు...

ఆప్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు జరిగింది. కుందుజ్ నగరంలో గల మసీదులో పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు వచ్చిన సమయంలో పేలుడు జరిగింది. దీంతో 50 మంది జనం చనిపోయారు. పేలుడు జరిగిందని స్థానిక అధికారులు తెలియజేశారు. ఎవరు పేల్చివేశారనే అంశానికి సంబంధించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సయ్యద్ అబద్ మసీద్ వద్ద పేలుడు జరిగింది. ఘటనకు సంబంధించి బాధ్యత వహిస్తున్నామని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

Dozens killed as huge explosion hits mosque in Afghan

ఆప్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ నుంచి వారి ఏలుబడిలో నడుస్తోంది. ఆ తర్వాత ఐఎస్ఐఎల్ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. ఈ రెండు గ్రూపుల మధ్య వైరంతో దాడులు కూడా జరుగుతున్నాయి. గత ఆదివారం కూడా కాబుల్ మసీదులో పేలుడు జరిగింది. దీంతో 12 మంది చనిపోగా.. 32 మంది గాయపడ్డారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ఈద్గాను లక్ష్యంగా చేసుకొని పేల్చివేశారు. ఈ సారి కూడా అలానే ప్రణాళికను అమలు చేశారు.

కుందుజ్ ప్రావిన్స్‌లో గల బందర్ జిల్లా ఖాన్ అబాద్‌లో పేలుడు జరిగింది. షియాలకు చెందిన మసీదు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డారు. 50 మంది చనిపోగా.. చాలా మంది గాయపడ్డారని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముహజిద్ వివరించారు. పేలుడుకు సంబంధించి గ్రాఫిక్ ఇమేజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పేలుడుతో ఆ ప్రాంతంలో భీతావాహ వాతావరణం నెలకొంది. అక్కడ రక్తపు మరకలతో భయానకంా సిచుయేషన్ ఉంది. మరో వీడియోలో పేలుడు జరగ్గానే అక్కడినుంచి ప్రజలు పారిపోతున్నట్టు కనిపించింది. అందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+