ఆస్పత్రిపై డ్రోన్ అటాక్.. 70 మంది మృతి
మిడిల్ ఈస్ట్ దేశమైన సూడాన్ లోని నార్త్ డర్ఫర్ రీజియన్ లోని ఎల్- ఫాషర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) జరిపిన డ్రోన్ దాడిలో దాదాపు 70 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో రోగులు ఈ దాడిలో గాయపడినట్లు సమాచారం. ఈ దాడిని 'ఊచకోత'గా ఆ దేశ ఆరోగ్య శాఖ అభివర్ణించింది. ఈ ఘటన జరగడానికి వారం రోజుల ముందే ఆర్ఎస్ఎఫ్ బలగాలు సూడాన్ సైన్యాన్ని హెచ్చరించాయి. సూడాన్ లోని డర్ఫర్ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాయి. సూడాన్ ప్రభుత్వం, సైన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఇరు వర్గాల అధికారులు శాంతిని పాటించాలని.. సాధారణ ప్రజలను హింసిచడం తగదని హెచ్చరించింది. ఇప్పటికే ఎల్- పాషర్ ప్రజలు సర్వం కోల్పోయారని.. అలాంటి వారిపై డ్రోన్ దాడి చేయడమేంటని మండిపడింది. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.

ఇలాంటి దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొంది. వెంటనే దాడులు ఆపాలని ఆదేశించింది. ' ఎల్- పాషర్ లో ఉన్న ఒకే ఒక్క హాస్పిటల్ ఇది. దాన్ని కూడా పేల్చేశారు. సాధారణ రోగులతోపాటు, మా వైద్యులను కూడా చంపేశారు. ఇలాంటి ఘటనలు దారుణం' అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. సూడాన్ లో మళ్లీ ఆరోగ్య సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
సూడాన్‌లో సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్)కు మధ్య గతేడాది ఏప్రిల్ నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఖార్టూమ్ దక్షిణ ప్రాంతమైన యార్మౌక్లో ఘర్షణలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications