ఘోరం.. ఆస్పత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది దుర్మరణం!
గత మూడేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్‌లో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ సూడాన్‌లోని ఎల్-దాయెన్ నగరంలోని ఓ ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 13 మంది పిల్లలు, ఇద్దరు నర్సులు, ఓ డాక్టరు సహా మొత్తం 64 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఈస్ట్ దార్పప్ ప్రావిన్స్ రాజధాని అయిన ఎల్-దాయెన్ నగరంలో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఈ నగరం పారామిలిటరీ దళాలైన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) ఆధీనంలో ఉంది. ఈ దాడిలో ఆస్పత్రి పై అంతస్తు పూర్తిగా ధ్వంసం కాగా.. ఎమర్జెన్సీ వార్డుతో పాటు కీలకమైన వైద్య పరికరాలు కాలి బూడిదయ్యాయి. దీనివల్ల వేలాది మందికి వైద్యం అందించే ఈ కీలక ఆస్పత్రి ప్రస్తుతం పనిచేయలేని స్థితికి చేరుకుంది. ఈ దాడికి సూడాన్ సైన్యమే కారణమని ఆర్ఎస్ఎఫ్ ఆరోపిస్తోంది. అయితే తాము అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తామని.. ఈ దాడితో తమకు సంబంధం లేదని సూడాన్ సైన్యం స్పష్టం చేసింది.

డబ్ల్యూహెచ్వో ఆవేదన
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గాబ్రేయేసస్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఇకనైనా ఈ రక్తపాతం ఆగాలి. శాంతియే అన్నింటికంటే గొప్పమందు. ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలి." అని ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు. సూడాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 213 దాడుల్లో దాదాపు 2,036 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది.
సూడాన్ అతలాకుతలం
2023 ఏప్రిల్ లో సూడాన్ ఆర్మీ, ఆర్ఎస్‌ఎఫ్ మధ్య మొదలైన అధికార పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షోభానికి దారితీసింది. ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.2 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు శరణార్ధులుగా వెళ్లిపోయారు. అంటే దేశ జనాభాలో మూడో వంతు వలస వెళ్లారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications