వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్తు విచిత్రం: ఆకాశం నుంచి భూమిపైకి వేలాడే ఇళ్లు.. నేరుగా మేఘాల్లోంచే నీళ్లు

అంతరిక్షంలోని ఆస్టరాయిడ్ కు బలమైన కేబుల్స్ సహాయంతో ఓ భారీ బహుళ అంతస్తుల భవనాన్ని ఆకాశం నుంచి భూమ్మీదికి వేలాడదీస్తారట. మన భవిష్యత్తు ఇళ్లు ఇవేనట.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: మనం ఇళ్లు భూమ్మీద నిర్మిస్తాం. భూమి నుంచి ఆకాశంలోకి ఎన్నో అంతస్తులతో కూడిన ఆకాశహార్య్మాలు మనకు కొత్త కాదు. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ బాగా పెరిగాక అవసరమైతే చంద్రుడు, అంగారకుడిపై కూడా ఇళ్లు నిర్మించాలని ఐడియాలు వేస్తున్నాం. కానీ ఇదే కొంచెం కొత్తగా ఉంది. సందేహాస్పదంగానూ ఉంది. మీరే చూడండి.

న్యూయార్క్ కు చెందిన క్లౌడ్స్ ఆర్కిటెక్చర్ ఆఫీస్ అనే నిర్మాణ సంస్థ ఆకాశం నుంచి భూమ్మీదికి వేలాడేలా ఓ భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తానని చెబుతోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా నిలుస్తుందట. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్లాన్ రూపొందించుకుంది.

భూమికి 50 వేల కిలోమీటర్ల ఎత్తులో ...

భూమికి 50 వేల కిలోమీటర్ల ఎత్తులో ...

నిజమే, ఈ క్లౌడ్స్ ఏవో నిర్మాణ సంస్థ రూపొందించుకున్న ప్లాన్స్ ప్రకారం.. ఇది నిజం. భూమికి 50 వేల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ఉన్న ఓ ఆస్టరాయిడ్ కు భారీ తాళ్లు బిగించి.. వాటి ఆధారంగా అక్కడి నుంచి భూమి వైపునకు ఈ భవనాన్ని నిర్మిస్తారు. ఆస్టరాయిడ్ నుంచి వేలాడదీసేందుకు అత్యంత దృఢమైన కేబుళ్లతో యూనివర్సల్ ఆర్బిటాల్ సపోర్ట్ సిస్టంను రూపొందిస్తారట.

వేలాడుతూ.. ప్రయాణిస్తూ...

వేలాడుతూ.. ప్రయాణిస్తూ...

ఆకాశం నుంచి వేలాడే ఈ భారీ బహుళ అంతస్తుల భవనం కదులుతూ ఉంటుందట. ఉత్తర, దక్షిణార్థగోళాల్లోని పలు నగరాలు, పట్టణాల మీదుగా ఈ భవనం ప్రయాణిస్తుందట. అంతేకాదు.. సరిగ్గా 24 గంటల తరువాత ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికే చేరుకుంటుందట.

మేఘాల నుంచి నేరుగా నీళ్లు...

మేఘాల నుంచి నేరుగా నీళ్లు...

ఈ భవన నిర్మాణంలో అత్యాధునిక ఇంజనీరింగ్ పద్ధతులు ఉపయోగిస్తారు. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఎత్తును, ఆకారాన్ని మార్చుకునే కిటికీలను అమర్చుతారు. భవనానికి పైన బిగించే సౌరఫలకాల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. నీటిని కూడా ఎప్పటికప్పుడు మేఘాల నుంచే నేరుగా సేకరిస్తారు.

దుబాయ్ లో భవన నిర్మాణం...

దుబాయ్ లో భవన నిర్మాణం...

ఈ భవనంలో నివాసాలతోపాటు వ్యాపార కేంద్రాలు ఉంటాయి. దీనిని దుబాయ్ లో నిర్మించాలని క్లౌడ్స్ ఏవో నిర్మాణ సంస్థ భావిస్తోంది. అక్కడైతే అమెరికా కన్నా చాలా తక్కువ ఖర్చులో నిర్మాణం పూర్తి చేయవచ్చని ఈ సంస్థ ఆలోచన. ఈ భవన నిర్మాణానికి సరిపోయే ఆస్టరాయిడ్ ను తాము గుర్తించాల్సి ఉందని క్లౌడ్స్ ఏవో పేర్కొంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రాబోయే కొన్నేళ్లలో ఆస్టరాయిడ్ల మీద పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని, కాబట్టి తమ ప్లాన్ ఊహాజనితం ఎంతమాత్రం కాదని ఈ సంస్థ బల్లగుద్ది మరీ చెబుతోంది.

English summary
A New York-based firm is proposing that Dubai be the site of a futuristic, asteroid-suspended skyscraper that orbits around the world. The speculative Analemma Tower - which is being proposed by the Clouds Architecture Office - is designed to be suspended downward on an asteroid orbiting 50,000km from earth. It would orbit in a figure-eight pattern across the northern and southern hemispheres in a 24-hour cycle each day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X