పిల్లలను తీసుకుని, రూ.270 కోట్లు వెంటబెట్టుకొని పారిపోయిన దుబాయ్ రాణి ...
దుబాయ్ : సాధారణ పౌరులు లేచిపోయిన .. తప్పు చేసిన నేరం. మరే అది రాజకుటుంబీకులు చేస్తే శాపం. కానీ దుబాయ్ రాజు భార్య తన పిల్లలను తీసుకొని పారిపోయింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే దాదాపు రూ.270 కోట్ల సంపదను కూడా తీసుకెళ్లడం గమనార్హం. ఆమె జర్మనీ, లేదంటే లండన్‌లో తలదాచుకొని ఉంటుందని రాజకుటుంబీకులు భావిస్తున్నారు.
కఠినమే కానీ ..
రాజులు, రాజవంశీయుల్లో ఆచార, వ్యవహారాల సంగతి తెలిసిందే. ఇక ముస్లిం దేశాల్లో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో తెలుసు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు చెందిన ఓ వివాహిత మాత్రం ధైర్యం చేసింది. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్‌ను వదిలివెళ్లిపోయింది. పిల్లలను తీసుకొని .. రూ.270 కోట్ల సంపద తీసుకొని వెళ్లింది. అయితే ఆచూకీకి సంబంధించి ఇప్పటివరకు వివరాలు తెలియరాలేదు. కొందరు జర్మనీ వెళ్లిందని, మరికొందరు లండన్‌లో తలదాచుకుందని పేర్కొంటున్నారు.

ప్రాణహానీ ఉందంటూ ...
రషీద్ ఆరో భార్య హయా బింత్ అల్ హుస్సేన్ .. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ తాను రాజుతో ఉండనని గత కొన్నిరోజులుగా హయా అంటోంది. తనకు విడాకులు ఇవ్వమని కూడా కోరింది. అయితే డైవర్స్ రాకపోవడంతో .. తన పిల్లలతో సహా .. రూ.270 కోట్లతో పారిపోయింది. అయితే తనకు దుబాయ్‌లో ప్రాణహాని ఉందని హయా బింత్ తెలుపడం విశేషం. తనకు ఆశ్రయం కల్పించాలని జర్మనీని కోరిందని తెలుస్తోంది. ఓ దౌత్యవేత్త సాయంతో జర్మనీ వెళ్లిందని రాజకుటుంబీకులు భావిస్తున్నారు. ఆక్ప్‌ఫర్డ్ వర్సిటీలో చదువుకున్న హయా .. లండన్ వెళ్లిపోయి ఉంటుందని రాజకుటుంబానికి సన్నిహితులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications