నవరాత్రుల వేళ అపచారం..పీఎం బహూకరించిన కాళిమాతా కిరీటం చోరీ..
దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అన్నీ చోట్ల ఘనంగా దుర్గాపూజ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ దుర్గాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల సెలవులు కూడా ఇచ్చేసారు. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా నాలుగు రోజులపాటు సెలవు ప్రకటించారు. దేశం మొత్తం పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. బంగ్లాదేశ్‌లో ఎంతో ప్రతిష్టి చెందిన సత్‌ఖిరా నగరంలోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం అపహరణకు గురైంది. ఈ చోరీ ఘటన ఆలయంలో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. అందులో ఓ యువకుడు అమ్మవారి బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కాస్త వెలుగులోకి వచ్చాయి.
బంగ్లాదేశ్‌లోని ప్రఖ్యాతి గాంచిన ఈ కాళీమాతా ఆలయ కిరీటంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు, ఆ అమ్మవారికి బంగారు కిరీటాన్ని కూడా బహుమతిగా అందజేసారు. అయితే, ఇప్పుడు ఈ కిరీటం దుర్గాపూజ ప్రత్యేక సందర్భంలో అపహరణకు గురవడం తీవ్ర కలకలం రేపింది.

నిన్న మధ్యాహ్నం సమయంలోనే..
ఈ ఆలయంలో గురువారం (అక్టోబర్ 10) మధ్యాహ్నం 2:47 నుండి 2:50 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు దిలీప్ కుమార్ బెనర్జీ రోజువారీ పూజను పూర్తి చేసిన అనంతరం, ఆలయ తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు. అయితే ఇతర పనుల్లో నిమగ్నమైన వారు, తిరిగి వచ్చి చూసే సరికి కాళి మాత బంగారు కిరీటం అదృశ్యమైంది. దీంతో ఈ విషయాన్ని వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు.
జేషోరేశ్వరి అంటే అర్థం...
ఈ ఆలయంలోని అమ్మవారి కిరీటం వెండితో తయారు చేసి, బంగారంతో కప్పబడి ఉంది. ఈ కిరీటం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా పేరుగాంచింది. "జేషోరేశ్వరి" అనే పేరుకు "జెషోర్ దేవత" అని అర్థం వస్తోందని పురాణాలు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 27, 2021న బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. అదే రోజు, అమ్మవారికి ప్రధానమంత్రి బంగారు కిరీటంతో పూలమాల వేశారు.












Click it and Unblock the Notifications