మోడీకి చేశారు కానీ..: జో బైడెన్ ఫోన్ కోసం ఇమ్రాన్ ఖాన్ ఎదురుచూపులు, ఆప్షన్స్ అంటూ పాక్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటోంది. ప్రపంచంలో భారత్‌కు లభించినంత ప్రాధాన్యత తమకు కూడా కావాలని కోరుకుంటోంది. అయితే, పాక్ వ్యవహారం మాత్రం అందుకు విరుద్ధంగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఉగ్రవాద దేశమన్న ముద్రను చెరిపేసుకోలేని పాక్.. ఎప్పుడూ భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ వేదికలపై పరువు తీసుకున్నా.. పాక్ తన వ్యవహారశైలిని మాత్రం మార్చుకోవడం లేదు.

భారత్‌తో అమెరికా సత్ససంబంధాలు

భారత్‌తో అమెరికా సత్ససంబంధాలు

అగ్రరాజ్యం అమెరికా, భారత్‌ల సత్ససంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలోనూ, కొత్త అధ్యక్షుడు జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా అమెరికా.. భారత్‌తో మంచి సంబంధాలనే కలిగివుంది. భారత్ కూడా అమెరికాకు స్నేహహస్తమే అందించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి పలుమార్లు ఫోన్ చేసి సంభాషించిన విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కంటగింపుగా మారింది.

జో బైడెన్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో నిరాశలో ఇమ్రాన్ ఖాన్

జో బైడెన్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో నిరాశలో ఇమ్రాన్ ఖాన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. భారత ప్రధాని మోడీతో పలుమార్లు సంభాషించిన జో బైడెన్ తనతో కనీసం ఒక్కసారిగా కూడా ఫోన్ సంభాషణ చేయలేదని ఫీలవుతున్నట్లు పాక్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసఫ్ తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారంలో ఎంతో కీలకంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోందని, అటువంటి దేశ ప్రధానమంత్రితో అమెరికా అధ్యక్షుడు ఇంతవరకు మాట్లాడలేదని.. 'ది ఫైనాన్స్ టైమ్స్ ఆఫ్ లండన్'కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ఇది ఎటువంటి సంకేతాలినస్తుందో అవగాహన చేసుకోగలమని, అమెరికా నాయకత్వం తమను ఇలాగే అశ్రద్ధ చేస్తుంటే తమకు కొన్ని మార్గాలుంటాయని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు పాకిస్థాన్ పత్రిక డాన్ వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడి ఫోన్ కాల్ కోసం పాక్ ఎదురుచూపులు

అమెరికా అధ్యక్షుడి ఫోన్ కాల్ కోసం పాక్ ఎదురుచూపులు


అధ్యక్ష భవనం నుంచి ఫోన్ కాల్ వస్తుందని ఎప్పటికప్పుడు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇది సాంకేతిక సమస్యో మరేదో కానీ నమ్మశక్యంగా లేదని అన్నారు. ఫోన్ కాల్ రావడమే ప్రత్యేక సదుపాయమైతే.. రక్షణ బంధం కూడా ప్రత్యేక సదుపాయమే.. పాకిస్థాన్‌కూ ప్రత్యామ్నాయాలుంటాయని యూసఫ్ పేర్కొన్నారు. పరోక్షంగా చైనా వెంట వెళతామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియలో ఇస్లామాబాద్‌కు కీలకమైన పాత్ర ఉందని అమెరికా అంగీకరిస్తోందని, తాలిబన్లను నిలువరించడానికి పాకిస్థాన్ సహయాన్నీ కోరుతోందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్‌తో జో బైడెన్ ఎందుకు మాట్లాడరు? అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనలో తానే మదనపడుతున్నట్లు సమాచారం. అయితే, చైనాతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే పాక్‌ను అమెరికా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.

పాక్‌కి ఫోన్ కాల్‌పై అమెరికా స్పందన ఇలా..

పాక్‌కి ఫోన్ కాల్‌పై అమెరికా స్పందన ఇలా..


కాగా, జో బైడెన్ ఇంకా చాలా దేశాధి నేతలతో మాట్లాడాల్సి ఉందని, త్వరలోనే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కూడా ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉందని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అధికారం చేపట్టిన కొన్ని రోజులకే భారత్ సహా పలు దేశాధి నేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే తనకు ఫోన్ చేయకుండా.. అవమానిస్తున్నారనే దోరణిలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో దాడులకు పాల్పడుతున్న తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. పాక్ వైఖరిపై ఆఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అమెరికా దళాలు ఉపసంహరణ అనంతరం తాలిబన్లు ప్రధాన నగరాలపై దాడులు చేస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఈ తాలిబన్లకు చైనా కూడా మద్దతు పలుకుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+