వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Earth Quake : యూఎస్ లో భూకంపం-పశ్చిమ టెక్సాస్ లో 5.4 తీవ్రతతో...

|
Google Oneindia TeluguNews

అమెరికాలో ఇవాళ భూకంపం సంభవించింది. టెక్సాస్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. 5.4 తీవ్రతతో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇది టెక్సాస్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపంగా కూడా నిర్ధారించారు. సరిగ్గా నెల క్రితం కూడా దాదాపు ఇదే తీవ్రతతో టెక్సాస్ లో భూకంపం రావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

పశ్చిమటెక్సాస్ లో ఇవాళ వచ్చిన భూకంప కేంద్రం 95 మైళ్ల దూరంలోని మిడ్ ల్యాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. స్ధానిక కాలమానం ప్రకారం డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5.35 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టంకానీ, ఆస్తినష్టం కానీ జరగలేదని తెలుస్తోంది. భూకంపం భూమి లోపలి పొరల్లో 9 కిలోమీటర్ల లోతున వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు.

 earth quake with 5.4 magnitude jolts west texas of US

టెక్సాస్ చరిత్రలోనే ఇది నాలుగో అతితీవ్ర భూకంపంగా యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. కొలరాడోలోని యూఎస్జీఎస్ జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని జియోఫిజిసిస్ట్ జానా పర్స్లీ దీనిపై మాట్లాడుతూ, ఏజెన్సీకి అందిన ప్రారంభ నివేదికల ప్రకారం, టెక్సాస్‌లోని అమరిల్లో, అబిలీన్ నుండి పశ్చిమాన కార్ల్స్‌బాడ్ వరకు 1,500 మందికి పైగా ప్రజలు భూకంప ప్రభావం కనిపించినట్లు ప్రకటించారు. అయితే ప్రాణనష్టం లేకపోవడంతోవారంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.

English summary
an earth quake with 5.4 magnitude jolts west texas of US today. this was the strongest ever in texas history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X