ఈ శతాబ్దం చివరికల్లా భూమ్మీద.. ఆరో మహా వినాశనం! కార్బన్ డయాక్సైడ్ అంతపని చేస్తుందా?
గడిచిన 54 కోట్ల ఏళ్లలో భూమ్మీద ఐదు మహా వినాశనాలు చోటు చేసుకున్నాయట. వీటిల్లో ఒకదాంట్లో రాకాసి బల్లులు నాశనమై పోయాయని తెలిసిన విషయమే. ఇదే నిజమైతే.. ఆరో మహా వినాశనానికి మనం రోజురోజుకీ దగ్గరవుతున్నట్లే
బోస్టన్: మరో 83 ఏళ్లలో.. అంటే 2100 సంవత్సరానికల్లా భూమ్మీద బతకడం చాలా కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన లారెన్జ్ సెంటర్ కూడా ఈ విషయాన్ని రూఢీ చేసింది.
ఈ శతాబ్దం చివరికల్లా సముద్రాల్లో బోలెడంత కార్బన్ డయాక్సైడ్ వాయువు చేరిపోయి భూమి చరిత్రలో మహా వినాశనం మొదలవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 54 కోట్ల ఏళ్లలో భూమ్మీద ఐదు మహా వినాశనాలు చోటు చేసుకున్నాయట. వీటిల్లో ఒకదాంట్లో రాకాసి బల్లులు నాశనమై పోయాయని తెలిసిన విషయమే. ఇదే నిజమైతే.. ఆరో మహా వినాశనానికి మనం రోజురోజుకీ దగ్గరవుతున్నట్లే లెక్క.

భూ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్ మోతాదులో గతంలో వచ్చిన మార్పులను విశ్లేషించడం ద్వారా మహా వినాశనానికి అవకాశాలను ఎంఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ మోతాదుల్లో మార్పులు ఎక్కువ కాలం పాటు ఉంటే, అది కాస్తా జీవజాతులు అంతరించిపో యేందుకు దారితీస్తుందట.
ప్రస్తుతం అతితక్కువ సమయంలోనే ఈ వాయువు వాతావరణంలో, సముద్రాల్లోకి చేరిపోతున్నందున 2100 నాటికల్లా మహా వినాశనానికి బీజం పడేందుకు అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డేనియల్ రోథ్‌మన్ తెలిపారు.
ఇప్పటికే భూమికి తీవ్ర ముప్పు పొంచి ఉందని, నిబిరు అనే గ్రహం అత్యంత వేగంగా భూమివైపునకు దూసుకొస్తోందని, అది గనుక ఢీకొంటే మహా ప్రళయం సంభవించడం ఖాయమని కొందరు చెబుతున్నారు.
ఇలాంటి వార్తలకు ఇప్పడు ఈ 'ఆరో మహా వినాశనం' తోడైంది. అది కాకపోతే ఇది.. మొత్తానికి భూమి ఫెటేలుమని పేలిపోవడం ఖాయమన్నమాట! అయితే భూమ్మీద ప్రళయం ఎప్పుడన్నదే మనుషుల్లో ఆసక్తి, ఉత్కంఠ కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications