నేపాల్‌లో మరోసారి భూకంపం: పరుగులు తీసిన జనం
నేపాల్‌నున భూకంపం మరోసారి వణికించింది. సోమవారం ఉదయం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఖాట్మాండ్: నేపాల్‌నున భూకంపం మరోసారి వణికించింది. సోమవారం ఉదయం రిక్టారు స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు.
ముగుకు 166 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈశాన్య నేపాల్, సెంట్రల్ నేపాల్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం రెండు భూకంపాలు చోటు చేసుకున్నాయి. కాగా, హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న నేపాల్‌కు సాధారణంగా భూకంప ముప్పు ఎక్కువగా ఉంటుంది.

2015లో వచ్చిన భూకంపంలో దాదాపు 9వేలమంది మృతి చెంద,గా దాదాపు 22 వేలమంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో దాదాపు 7.8తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి.












Click it and Unblock the Notifications