జపాన్‌లో భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో ప్రకంపనాలు..
కజికిస్తాన్, ఉత్తర భారతదేశంలో ప్రకంపనాలు వచ్చిన మరుసటి రోజే జపాన్‌లో భారీ భూకంపం సంభవిచింది. జపాన్‌లో శనివారం రాత్రి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.1గా ఉంది. మియాగి, ఫకసిమా, టొహోకు ప్రాంతంలో భూకంప ప్రభావం ఉంది. ఇదీ జపాన్‌లో రెండో అత్యంత భారీ భూకంపం అని అధికారులు తెలిపారు. ప్రకంపనాలు టోక్యో వరకు ప్రభావం చూపాయని వెల్లడించారు. అక్కడ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.08 గంటలకు 4 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయని పేర్కొన్నారు. భూకంపంతో సునామీ హెచ్చరిక మాత్రం జారీచేయలేదని చెప్పారు.
భూకంపంతో ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదని.. ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం, తీరం మధ్య దూరం ఉండటంతో ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ఈటొరొఫు ద్వీపంలో భూకంప కేంద్రం ఉంది. దీనిపై జపాన్, రష్యా మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. భూకంపంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

పరిస్థితిని ప్రధాని యోషిహిడే సుగా సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత ప్రజలను తరలిస్తున్నామని పేర్కొన్నారు. భూకంప ప్రభావంతో దాదాపు 9.5 లక్షల మంది నిలువనీడ కోల్పోయారు. జపాన్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 6 అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాల్లో 20 శాతం ఇక్కడే వస్తాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications