భారీ భూ కంపం - కుప్ప కూలిన భవనాలు..!!
మయన్మార్‌లో ఈ ఉదయం భారీగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్ర నమోదైనట్లు.. భారీగా భవనాలు కుప్పకూలినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో థాయ్ లాండ్ రాజధాని బ్యాకాంక్ లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 4.5 నుంచి 5.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మయన్మార్ తో తీవ్రత ఎక్కువగా ఉండటంతో నష్టం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మయన్మార్, బ్యాంకాక్ లో చోటు చేసుకున్న భూకంప తీవ్రత తో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరుగులు తీసారు. పెద్ద భవనాలు కుప్ప కూలినట్లు స్థానిక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం పైన అధికారి కంగా సమాచారం రాలేదు. నిత్యం జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే బ్యాంకాక్ నగరంలో పెద్ద ఎత్తున వచ్చిన భూ ప్రకంపనలతో ఆందోలన పెరుగుతోంది. అయితే, ప్రజలు వెంటనే అప్రమత్తం అయ్యారు. భవనాల నుంచి బయటకు రావటంతో చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక, మయన్మార్ లోనూ భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది.

భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. సముద్ర తీరానికి సమీపంలోని భూమిలో అంతర్గతంగా చోటు చేసుకున్న కదలికల కారణంగా ఈ భూకంపం వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భూకంపం చోటు చేసుకున్న ప్రాంతానికి అత్యవసర సేవల బృందాలు చేరుకున్నాయి. కాగా, అగ్నిమాపక దళాలతో పాటుగా పెద్ద సంఖ్యలో వైద్య బృందాలు ఘటనా స్థలికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications