ఏదో పెను ముప్పు పొంచివుంది..
Russia Earthquake 2025: రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మొన్నటికి మొన్న 8.8 తీవత్రతో సంభవించిన భూకంపంతో ఊగిపోయింది రష్యా. సునామీకి కారణమైంది. జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్ సహా పలు పసిఫిక్ తీర ప్రాంత దేశాలు భయంకపితులయ్యాయి. కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం కనిపించింది. రాకాసి అలలు జపాన్ ను కంటి మీద కునుకు లేకుండా చేశాయి.

ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితే ఏర్పడింది. రష్యాలోని కురిల్ దీవుల తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0గా నమోదైంది. ఈ ఉదయం 11:07 నిమిషాలకు 50.76 ఉత్తర అక్షాంశం, 157.71 తూర్పు రేఖాంశం వద్ద భూమి ప్రకోపించింది.
మూడు రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. ఈ నెల 1వ తేదీన ఇదే కురిల్ ఐలండ్స్ లో 6.2 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ద్వీప సముదాయం ఇది. క్రియాశీలక అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. 20 నుంచి 25 వేల వరకు జనాభా ఉంటుందిక్కడ.
డిస్ప్యూటెడ్ ఐలండ్స్ లల్లో ఇదీ ఒకటి. రష్యా, జపాన్ దీన్ని తమదిగా చెప్పుకొంటోన్నాయి. రష్యా సఖాలిన్ ప్రావిన్స్ ప్రభుత్వం తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని క్రెమ్లిన్ ప్రకటించింది.
భూకంప తీవ్రత నేపథ్యంలో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. తొలుత సునామీ సంభవించే ప్రమాదం ఉండొచ్చని వార్తలొచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా- రష్యా తీరంలో 8.8 తీవ్రత భూకంపం తర్వాత 16 గంటల్లో 4.4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు దాదాపుగా 125 వరకు చోటు చేసుకున్నాయి.
వీటిలో మూడు ప్రకంపనలు 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కురిల్ ఐలండ్స్ లో వచ్చిన భూకంపం కూడా అలాంటిదేనని అంచనా వేస్తోన్నారు. సాధారణంగా, ప్రధాన భూకంపం సంభవించిన తొలి కొన్ని గంటలు లేదా రోజుల పాటు ప్రకంపనలు తీవ్రంగా ఉంటాయి. అధిక సంఖ్యలో సంభవిస్తుంటాయి.
లోతుగా సంభవించే భూకంపాల కంటే తక్కువ లోతులో అంటే షాలో భూకంపాలు మరింత ప్రమాదకరమైనవిగా భావిస్తుంటారు. దీనికి కారణం.. లోతు తక్కువగా ఉండటం వల్ల భూకంపాల నుండి వచ్చే తరంగాలు భూమి ఉపరితలానికి వేగంగా చేరుకోవడమే. దీనివల్ల భూమి తీవ్రంగా కంపిస్తుంది. అలాంటప్పుడే కట్టడాలకు గణనీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications