రెండున్నర గంటల వ్యవధిలో పాకిస్తాన్, నేపాల్‌లల్లో..!!
Pakistan Earthquake: పొరుగున ఉన్న పాకిస్తాన్, నేపాల్‌లల్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత భారత్‌లోనూ కనిపించింది. బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. వీటి వల్ల ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఆ రెండు దేశాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగివుండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
తొలుత నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా రికార్డయింది. సెంట్రల్ రీజియన్ పరిధిలోని సింధుపల్‌చౌక జిల్లా కొడారి జాతీయ రహదారి సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ ఎర్త్‌క్వెక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.

రాజధాని ఖాట్మండూకు తూర్పు దిశగా ఉన్న 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఫలితంగా భూకంప తీవ్రత ఖాట్మండూలోనూ కనిపించింది. భూమి ప్రకంపించిన వెంటనే జనం రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదవుతుండటంతో ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే గడిపారు.
2015లో నేపాల్‌లో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 9,000 మందికి పైగా బలి అయిన విషయం తెలిసిందే. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు అప్పట్లో. భారత్ సహా అనేక దేశాలు ఆ దేశాన్ని ఆదుకున్నాయి. మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టాయి. ఆపన్న హస్తాన్ని అందించాయి.
దీని తరువాత సరిగ్గా రెండున్నర గంటల వ్యవధిలో పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:14 నిమిషాలకు భూమి కంపించింది. రాజధాని ఇస్లామాబాద్‌కు ఈశాన్య దిక్కున 105 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ జంట భూకంపాల తీవ్రత భారత్‌లోనూ కనిపించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications