దుబాయ్‌లో ప్రకంపనలు..? 6.5 తీవ్రతతో భూకంపం, ఇక్కడే
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న వేళ భూ ప్రకంపనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుండగా.. దక్షిణ ఇరాన్‌లో ప్రకంపనాలు వచ్చాయి. అదీ కూడా తీవ్రత ఎక్కువగా నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై 6.5గా ఉంది. బందర్ అబ్బాస్ సిటీ వద్ద భూకంపం వచ్చింది. ఈ మేరకు యూరొపియన్ మెడిటెరియన్ సిస్మోలాజికల్ ఏజెన్సీ తెలియజేసింది. భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపిందని నిపుణులు తెలియజేశారు.
తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల దేశాలపై కూడా ప్రభావం చూపనుంది. జుమెరా లేక్ టవర్స్, నాడా, డిరా, బార్సా, దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ పార్క్, డిస్కవరీ గార్డెన్ వద్ద భూకంపం ప్రభావం చూపింది. షార్జా, అబుదాబిలో కూడా ప్రకంపనలు వచ్చాయి. దుబాయ్‌లో భూకంపం వచ్చిన.. దీనికి సంబంధించిన సమాచారం ఐసీసీ తెలియజేయలేదు. యూఏఈ, ఒమన్‌లో నాలుగు వేదికలపై 44 టీ20 మ్యాచులను నిర్వహించారు. ఇవాళ ఫైనల్ జరుగుతుంది. ఈ క్రమంలో ప్రకంపనలు రావడం కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ సారి హాట్ ఫేవరెట్‌గా ఇండియా బరిలోకి దిగింది. అయితే ఆదిలోనే హంసాపాదు అన్నట్టు రెండు మ్యాచులు వరసగా ఓడిపోయింది. పాకిస్తాన్‌తో ఓటమిని సగటు అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు వచ్చింది. దీనికి సంబంధించి కోహ్లి ముందే ప్రకటించిన.. ఓటమితో మార్పు అనివార్యం అయ్యింది. టీ20లకు కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించారు.












Click it and Unblock the Notifications