ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌పై కంటికి కనిపించని స్పేస్ లేజర్ వెపన్‌తో దాడి?
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్- సదటిది ప్రమాదశావత్తూ జరిగిన మరణం కాదా? ఆయన హత్య వెనుక కుట్ర కోణం ఉందా?.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ శతృదేశంగా గుర్తింపు పొందిన ఇజ్రాయెల్ ఈ కుట్రకు తెర తీసి ఉండొచ్చంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ వాటిని తోసిపుచ్చింది.
ఆయన ప్రయాణించిన బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్‌పై అత్యాధునికమైన స్పేస్ లేజర్ వెపన్‌తో దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి. దీనికి సంబంధించిన పలు అనుమానాలను ఇరాన్, పాలస్తీనా అనుకూలవాదులు లేవనెత్తుతున్నారు.

మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా స్పేస్ లేజర్ వెపన్ తయారైంది. స్టార్ వార్స్, కేప్టెన్ మార్వెల్.. వంటి హాలీవుడ్ సినిమాల్లో సాధారణంగా మనం చూస్తుంటాం ఇలాంటి వెపన్స్‌ను. కంటికి కనిపించని అత్యంత ఆధునికమైన ఈ స్పేస్ లేజర్ వెపన్‌తో ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌పై దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
lsraeI definitely assassinated Iranian President Ebrahim Raisi pic.twitter.com/gesgrfl1IL
— Zagonel (@Zagonel85) May 19, 2024
పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ వంటి మిలిటెంట్ల ఉద్యమాన్ని అణచివేస్తోన్న ఇజ్రాయెల్ దూకుడుకు ఎప్పటికప్పుడు కళ్లెం వేసేలా వ్యవహరిస్తోన్న ఇరాన్ అడ్డుతొలగించుకోవడంలో భాగంగా రైసీ హెలికాప్టర్‌పై ఈ దాడి జరిగి ఉండొచ్చని చెబుతున్నారు కొందరు నెటిజన్లు. రైసీ లేకపోతే ఇరాన్ బలహీనపడుతుందనే కారణంతోనే ఈ దాడి చేశారంటూ ఆరోపిస్తోన్నారు.
హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇబ్రహీ రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హొస్సైన్ అమీరబ్దుల్లాహియాన్, అయతొల్లా సయ్యద్ ముహమ్మద్ అలీ అల్-హషెమ్, డాక్టర్ మాలిక్ రహ్మతి, సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవి, అన్ అనసర్ అల్-మెహదీ కార్ప్స్, పైలెట్, కో పైలెట్, కృఛేవ్ అనే వ్యక్తి మరణించారు.












Click it and Unblock the Notifications