భుజాలు తడుముకున్న ఇజ్రాయెల్: 5 రోజుల సంతాపం: భారత్‌లో ఇరాన్ జెండాలు అవనతం
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్- సదటి కన్నుమూశారు. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇబ్రహీ రైసీతో పాటు మరో తొమ్మిది మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు.
వాళ్లు ప్రయాణిస్తోన్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీం రైసీ. డ్యామ్ ప్రారంభోత్సవం ముగిసిన తరువాత హెలికాప్టర్‌లో రాజధాని టెహ్రాన్‌కు తిరుగుముఖం పట్టారు.

ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్- జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తోన్న సమయంలో అది కుప్పకూలింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు.
ఇబ్రహీ రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హొస్సైన్ అమీరబ్దుల్లాహియాన్, అయతొల్లా సయ్యద్ ముహమ్మద్ అలీ అల్-హషెమ్, డాక్టర్ మాలిక్ రహ్మతి, సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవి, అన్ అనసర్ అల్-మెహదీ కార్ప్స్, పైలెట్, కో పైలెట్, కృఛేవ్ అనే వ్యక్తి మరణించారు.
వాళ్లందరి పార్థివదేహాలను సహాయక సిబ్బంది సంఘటన స్థలం నుంచి తరలింంచారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తబ్రిజ్ సిటీకి తీసుకెళ్లినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీని వెనుక కుట్రకోణం ఉండొచ్చంటూ వార్తలు వెల్లువెత్తాయి.
ప్రత్యేకించి- ఇరాన్ శతృదేశంగా గుర్తింపు పొందిన ఇజ్రాయెల్ ప్రమేయం ఉండచ్చనే అనుమానాలు చెలరేగాయి. ఈ వార్తలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం వెనుక తమ ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ దుర్ఘటన తమ వల్ల సంభవించలేదు.. అంటూ పేరు చెప్పడానికి నిరాకరించిన ఇజ్రాయెల్ అత్యున్నత అధికారి ఒకరు స్పష్టం చేశారు.
కాగా- రైసీ మృతి నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అయిదు రోజుల సంతాపం తెలిపింది. ఈ అయిదు రోజుల పాటు ఎలాంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించట్లేదని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, సమావేశాలను కూడా జరపకూడదని సూచించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోవంక- భారత్‌లో అన్ని చోట్లా కూడా ఇరాన్ జాతీయ జెండాలను అవనతం చేశారు. రైసీ మృతికి సంతాప సూచకంగా ఇరాన్ రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ ఆఫీస్, హైకమిషనర్ కార్యాలయాలపై ఎగురవేసిన ఆ దేశ జాతీయ పతాకాలను అవనతం చేశారు. అయిదు రోజల పాటు వాటిని అలానే ఉంచనున్నారు.
-
వాళ్లను చంపేస్తాం.. యుద్ధం ఆగదు: ఇరాన్ సంచలన వార్నింగ్ -
యుద్ధ నౌకపై హెచ్చరిక లేకుండా అమెరికా చర్య.. మూల్యం చెల్లించక తప్పదన్న ఇరాన్! -
"ముజ్తబా హొస్సేనీ" గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా..? -
భారత్ కు ఇరాన్ బిగ్ రిలీఫ్-హార్ముజ్ జలసంధిపై కీలక ప్రకటన..! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
"బి-52 స్ట్రాటో ఫోర్ట్రెస్" రెడీ చేస్తున్న అమెరికా.. ఇరాన్ పని ఖతమేనా ? -
భారత్ వరకూ వచ్చేసిన వార్ ? తీరంలో ఇరాన్ నౌకను ముంచేసిన అమెరికా..! -
ఒక్క లేఖతో మారిన దేశం పేరు! 'పర్షియా' కాస్తా 'ఇరాన్'గా ఎలా మారింది? -
ఇరాన్ వార్ పై ట్రంప్ వర్సెస్ ట్రంప్..! పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ? -
మారణహోమం: 800 మంది మృతి! -
గల్ఫ్ లో అమెరికా డేటా సెంటర్లపై దాడుల వెనుక..!ఇరాన్ వ్యూహమిదేనా ? -
ఇరాన్ సుప్రీమ్ లీడర్ గా కీలక నేత.: నియామకం వెనుక?












Click it and Unblock the Notifications