Nobel Prize 2024: ఈ ఏడాది ఆర్ధికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి-ఎందుకంటే..?

ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆర్ధికశాస్త్ర నోబెల్ బహుమతిని ముగ్గురికి సంయుక్తంగా ప్రకటించారు. టర్కీకి చెందిన డారన్ అసెమొగ్లు, అమెరికాకు చెందిన సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ ఈ ఏడాది ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. సంస్ధలు ఎలా ఏర్పడతాయి, అలాగే ఎలా శ్రేయస్సును ప్రభావితం చేస్తాయనే అంశంపై వీరు చేసిన పరిశోధనలకు ప్రతిఫలంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.

ఇందులో అసెమొగ్లు, జాన్సన్ ఇద్దరూ మస్సాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాబిన్ సన్ చికాకూ యూనివర్సిటీకి చెందిన వారు. అంతర్జాతీయంగా ఆర్ధిక అసమానతలకు గల కారణాలపై వీరు పరిశోధనలు జరిపారు. అలాగే కొన్ని దేశాలు పురోగమిస్తుండగా.. మరికొన్ని అలాగే ఉండిపోవడంపైనా వీరు పరిశోధనలు చేశారు. వీటికి ప్రతిఫలంగా వీరికి నోబెల్ ఆర్ధిక శాస్త్ర పురస్కారం లభించింది.

Economic Nobel Prize 2024 jointly awarded to Daron Acemoglu Simon Johnson and James Robinson

యూరోపియన్లు ప్రపంచంలోని పెద్ద భూభాగాలను వలసరాజ్యాలుగా చేసుకున్నప్పుడు, అక్కడి సమాజాలలోని సంస్థలు మారాయని వీరి పరిశోధనలు తేల్చాయి. ఇది కొన్నిసార్లు నాటకీయంగా ఉంటుందని, కానీ ప్రతిచోటా ఒకే విధంగా జరగలేదని అవి తెలిపాయి. చట్టబద్దమైన పాలన జరగనప్పుడు జనాభాను దోపిడీ చేసే సంస్ధలు వృద్ధిని సృష్టించవని ఈ ముగ్గురికి నోబెల్ పురస్కార ప్రకటన సందర్భంగా రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. కొన్ని చోట్ల స్థానిక జనాభాను దోపిడీ చేయడం, వలస వాదుల ప్రయోజనాల కోసం వనరులను వెలికితీయడం లక్ష్యంగా ఈ దోపిడీ సాగినట్లు వీరి పరిశోధనలు తేల్చాయి. మరికొన్నింటిలో యూరోపియన్ వలసదారుల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం సమ్మిళిత రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను వారు ఏర్పరిచారని కూడా వీరు తమ అధ్యయనంలో వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+