జైల్లో కాల్పుల మోత: క్షణాల్లో 17 మంది ఖైదీల మృతి!
Gang War in Prison: దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోంది. ఈ దేశాల్లో గ్యాంగ్‌వార్, అల్లర్లు, దాడులు వంటి సంఘటనలు వేగంగా పెరుగుతున్నాయి. తరచుగా ఇలాంటి కేసులు కనిపించే దేశాలలో ఈక్వెడార్ కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా ఈక్వెడార్ జైళ్లలో హింస మరింతగా పెరిగింది. అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లు జైళ్లలో ఉండటం వల్ల జైళ్లు కూడా హింసకు దూరంగా ఉండలేకపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈక్వెడార్ జైలులో అల్లర్లు జరగగా.. ఇప్పడు గ్యాంగ్ వార్ జరిగింది.
జైల్లో గ్యాంగ్‌వార్.. కాల్పులు
గురువారం నాడు ఈక్వెడార్‌లోని ఎస్మెరాల్డాస్ ప్రావిన్స్ రాజధాని ఎస్మెరాల్డాస్‌లోని జైలులో గ్యాంగ్‌వార్ జరిగింది. పాత పగలు, శత్రుత్వం కారణంగా రెండు ముఠాల దుండగుల మధ్య మొదలైన ఘర్షణ కొద్దిసేపటికే కాల్పుల మోతకు దారి తీసింది. రెండు ముఠాలకు చెందిన దుండగులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

17 మంది దుండగులు మృతి.. పలువురికి గాయాలు
స్థానిక మీడియా ప్రకారం.. ఈక్వెడార్‌లోని ఎస్మెరాల్డాస్ జైలులో గురువారం జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌లో రెండు శత్రు గ్యాంగ్‌లకు చెందిన 17 మంది దుండగులు మరణించారు. వీరంతా జైల్లోనే తుది శ్వాస విడిచారు. ఈ గ్యాంగ్‌వార్‌లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దాడి ఎలా జరిగింది?
ఈ గ్యాంగ్‌వార్ ఒక జైలు సెల్ బ్లాక్‌లో ప్రారంభమైంది. ఒక గ్యాంగ్‌కు చెందిన దుండగులు పొంచి ఉండి మరో గ్యాంగ్‌కు చెందిన వారిపై దాడి చేసి, సెల్ తాళాలను దొంగిలించారు. ఆ తర్వాత బయటి సెల్‌లో ఉన్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని ఈ హింసాకాండకు పాల్పడ్డారు.పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. జైలు అధికారులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications