బంగ్లాదేశ్ వేదికగా అమెరికా వర్సెస్ చైనా సమరం.. ఎన్నికల జోక్యంతో రగడ !!
ఎన్నికల సమయం దగ్గరపడితే రాజకీయ వేడి సహజమే. కానీ బంగ్లాదేశ్‌లో రాబోయే 2026 సాధారణ ఎన్నికలు మాత్రం దేశ సరిహద్దులు దాటి ప్రపంచ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏప్రిల్ 2026లో జరగనున్న ఈ ఎన్నికలు ఇప్పుడు కేవలం ప్రభుత్వ మార్పు ప్రశ్నగా కాకుండా, అమెరికా-చైనా మధ్య సాగుతున్న భౌగోళిక రాజకీయ పోరుకు కేంద్రబిందువుగా మారుతున్నాయి
ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ నాయకత్వంలో ప్రజాస్వామ్య దిశగా మొదలైన ఈ పరిణామం.. ఇప్పుడు ప్రపంచంలోని రెండు అతిపెద్ద అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష పోరుగా మారింది. గత కొద్దిరోజుల్లోనే ఈ ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. బంగ్లాదేశ్‌కు కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి, "విదేశీ దురుద్దేశపూర్వక ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం"పై ప్రకటన చేశారు. దీనికి చైనా వెంటనే స్పందించి తీవ్ర స్థాయిలో ఖండించింది.

ఈ మాటల యుద్ధం ఢాకా రాజకీయాలను ప్రపంచ వేదికపైకి తీసుకొచ్చింది. అమెరికా ఆందోళనల వెనుక ప్రధాన కారణం చైనా ప్రభావమే అని భావిస్తున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) ద్వారా బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లపై పెరుగుతున్న ఆధారపడటం వాషింగ్టన్‌కు అసౌకర్యంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది తమ ఇండో-పసిఫిక్ వ్యూహానికి ముప్పుగా అమెరికా భావిస్తోందని అంటున్నారు.
కాగా ఇదివరకే రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB)పై ఆంక్షలు, ప్రజాస్వామ్యాన్ని అణిచే శక్తులపై వీసా పరిమితులు విధించిన అమెరికా.. ఇప్పుడు చైనా వ్యూహాత్మక చర్యలను బహిరంగం గానే ప్రశ్నిస్తోంది. మయన్మార్, శ్రీలంక వంటి దేశాల్లో చైనా పెట్టుబడులు రాజకీయ ప్రభావంగా మారుతున్న తీరును ఉదాహరణగా చూపుతూ అమెరికా అప్రమత్తమవుతోంది.
అయితే ఈ మొత్తం పరిణామాల్లో అసలు పరీక్ష బంగ్లాదేశ్‌దే. దేశీయ రాజకీయాలపై విదేశీ ప్రభావం పడకుండా చూస్తూ.. స్వతంత్ర నిర్ణయాలతో ముందుకు వెళ్లగలదా అన్నదే కీలకంగా మారింది. ఈ సమతుల్యతను సాధిస్తే బంగ్లాదేశ్ బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదగగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విఫలమైతే మాత్రం, ఎన్నికలపై విదేశీ జోక్యం అన్న ఆరోపణలు మరింత బలపడే ప్రమాదం ఉంది.
ఇక బంగ్లాదేశ్‌లో జరగబోయే ఎన్నికలు ( elections ) ఎవరు అధికారంలోకి వస్తారన్న దానికంటే కూడా, అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న పోరాటంలో ఒక అభివృద్ధి చెందుతున్న దేశం తన స్వతంత్ర మార్గాన్ని ఎలా కాపాడుకుంటుంది అన్న ప్రశ్నకు సమాధానంగా మారుతున్నాయి.
-
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
TN Election Survey: గెలిచేది ఆ పార్టీయేనా? జ్యోతిష్యుల షాకింగ్ జోస్యం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications