ఏక్ నిరంజన్: ట్వీట్టర్ బోర్డు నుంచి అందరూ తొలగింపు, ఇక మాస్క్ ఒక్కరే
ట్విట్టర్‌ను ఎలాన్ మాస్క్ హస్తగతం చేసుకున్నన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సీఈవో సహా బాస్‌లపై వేటు వేశారు. కొత్త వారిని తెచ్చుకుంటున్నారు. అయితే సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న బోరడ్ ఆఫ్ డైరెక్టర్లు అందరినీ తొలగించారు. దీంతో మాస్క్ ఒక్కరే ప్రస్తుతం డైరెక్టర్‌గా కొనసాగుతారు.
నవంబర్ 1వ తేదీకి ముందు చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్నారా అని మాస్క్‌ను అడగగా.. అదేం లేదని చెప్పారు. కానీ ఆ వెంటనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఉద్వాసన పలికారు. దీంతో ఇప్పటివరకు కొనసాగిన వారంతా మాజీలు అయిపోయారు. తొలగించిన ఉద్యోగులకు గ్రాంట్లు ఇవ్వకుండా మాస్క్ తప్పించాలని అనుకున్నాడట. అందుకే నవంబర్ 1వ తేదీ డెడ్ లైన్ విధించాడు.

44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను మాస్క్ కొనుగోలు చేశాడు. ఆ వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దెకు ఉద్వాసన పలికారు. ఆ పోస్టుల నుంచి తప్పించి.. న్యాయపరంగా అందజేయాల్సిన సొమ్మును ఇచ్చేస్తున్నారు.
ఇదే కాదు స్టాఫ్ తగ్గించాలని కూడా మాస్క్ అనుకున్నాడట. 75 శాతం మందిని తొలగిస్తారనే ప్రచారం జరిగింది. 7500 మంది స్టాప్ కాస్త 2 వేలకు కుదిస్తారనే ప్రచారం జరిగింది. కానీ దానిని మాస్క్ ఖండిస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications