నిన్ను, నీ కార్లను అమెరికాలో తిరగనివ్వను

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. సెనెట్ లో ట్యాక్స్ బిల్లు ఆమోదం పొందితే.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ ఎలాన్ మస్క్ చేసిన హెచ్చరికపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. టెస్లా కార్లాకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలను నిలిపివేస్తానని అన్నారు.

ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా అమెరికాలో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యం నిలబడదని, అవి లేకపోతే తన దుకాణాన్ని మూసేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఆయన తిరిగి తన సొంత దేశం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Elon Musk probably have to close up shop and head back home to South Africa

ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్‌ ఈ మేరకు ఓ పోస్ట్‌ పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలపై తన వైఖరి ఏమిటో గతంలోనే స్పష్టం చేశానని, దీనిపై గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, అనుసరించిన విధానాలను మొదటి నుండీ వ్యతిరేకించానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలు హాస్యాస్పదమైనవని వ్యాఖ్యానించారు.

ఇదే విషయాన్ని అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రస్తావించానని ట్రంప్ గుర్తు చేశారు. తన గెలుపు కోసం ఎలోన్ మస్క్ ఎంతో చేశాడని, మద్దతు ఇచ్చాడని వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే టెస్లా సహా ఇతర ఈవీలకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాలు, విధానాలకు వ్యతిరేకమని స్పష్టం చేశానని, ఆ మస్క్ కూ తెలుసునని వివరించారు.

ఎలక్ట్రిక్ కార్లు కొంతమంది వినియోగదారులకు మాత్రమే సరిపోతాయని, ప్రతి అమెరికన్‌ కూడా వాటిని కొనలేడని ట్రంప్ పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వాటిని కొనేలా బలవంతం చేయడం సరికాదని ట్రంప్ స్పష్టం చేశారు. అంతరిక్షం, ఉపగ్రహ ప్రాజెక్టులతో సహా అనేక ఫెడరల్ సబ్సిడీల ద్వారా మస్క్.. దేశ చరిత్రలో ఎవ్వరికీ లభించనంత లబ్ధి పొందుతున్నారని తేల్చి చెప్పారు.

తన అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సబ్సిడీలు లేకపోతే, ఎలాన్ మస్క్ తన దుకాణం మూసివేసి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ట్రప్ వ్యాఖ్యానించారు. రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండబోదని, తమ దేశానికి ఓ అదృష్టంగా ఇది మిగులుతుందని ఘాటుగా విమర్శించారు.

బిగ్, బ్యూటిఫుల్ బిల్ ను జులై 4వ తేదీలోగా ఆమోదించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బిల్లుపై ఎలాన్ మస్క్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే కొత్తగా అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికా జాతీయ అప్పులు భారీగా పెరిగిపోతాయనేది మస్క్ వాదన. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ అధినేతగా గతంలో తాను సాధించిన విజయాలు, పొదుపులు అన్నీ కూడా వృథా అవుతాయని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+