• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆపన్న హస్తం: వరదబాధితుల కోసం 175టన్నుల నిత్యావసరాలను మోసుకెళ్లనున్న ఎమిరేట్స్ విమానం

|
  వరదబాధితుల కోసం 175టన్నుల నిత్యావసరాలను మోసుకెళ్లనున్న ఎమిరేట్స్ విమానం

  కేరళ రాష్ట్రం వరదల ధాటికి తుడుచుపెట్టుకుపోయింది. గత వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ విపత్తుకు కేరళ తల్లడిల్లింది. ఎంతో మంది కేరళను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే యూఏఈ రూ.700 కోట్లు సహాయం చేస్తామని ముందుకు వచ్చింది. అయితే కొన్ని నియమనిబంధనలతో భారత ప్రభుత్వం ఆ సహాయన్ని నిరాకరించింది. ఆ తర్వాత కేరళకు నగదు రూపంలో ఎంత సహాయం చేస్తామని చెప్పలేదంటూ యూఏఈ ప్రభుత్వం తెలిపింది. ఇంత గందరగోళ నడుమ... యూఏఈకి చెందిన ప్రముఖ విమానాయాన సంస్థ ఎమిరేట్స్ కేరళకు ఆపన్న హస్తం ఇస్తామంటూ ముందుకొచ్చింది. వరద బాధితులను ఆదుకునేందుకు 175 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను కేరళకు తరలిస్తామంటూ ప్రకటించింది.

  కేరళలో సంభవించిన వరదలకు అధికార లెక్కల ప్రకారం 231 మంది మృతి చెందారు. అనధికారికంగా ఆ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది ఒక్క భారతదేశాన్నే కదిలించలేదు... దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా కేరళకు జరిగిన భారీ నష్టం విని తల్లడిల్లిపోయారు. పర్యాటక ప్రాంతమైన కేరళ ఒకప్పుడు ఎలా ఉండేదో వారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విదేశాల నుంచి కేరళ అందాలను వీక్షించేందుకు వచ్చి ఆ మధురానుభూతులను తమవెంట తీసుకెళ్లిన చాలామంది విదేశీయులు కేరళను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కేరళ తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేందుకు తమ వంతు సాయం చేశారు.

  Emirates flight to carry 175 tonnes aid to flood hit kerala

  ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ వరదబాధితుల కోసం నిత్యావసర వస్తువులను 12 విమానాల్లో తరలించనుంది. యూఏఈలో ఉన్న మళయాళీలతో సహా అక్కడి ప్రజలు కేరళ కోసం విరాళాలు ఇచ్చారు. వాటన్నిటినీ ఎమిరేట్స్ విమానాలు తీసుకుని తిరువనంతపురం విమానాశ్రయానికి బయలుదేరాయి. ఇందులో బోట్లు, దుప్పట్లు, పొడి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ స్థానికంగా ఉన్న సహాయశిబిరాలకు చేరుస్తామని ఎమిరేట్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  UAE's national carrier Emirates has said it will fly over 175 tonnes of relief material to Kerala, which is facing the deadliest deluge in nearly 100 years."Emirates SkyCargo will carry flood relief cargo of over 175 tonnes to Kerala, India, joining the UAE community in their support of the people of Kerala," the airlines said in a statement.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more