ఉక్రెయిన్‌తో యుద్ధానికి తెర! పుతిన్‌కు ట్రంప్ ఫోన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని నిలువరించేందుకు మరో కీలక ముందడుగు వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా వీరి సంభాషణ జరిగింది. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు పుతిన్ అంగీకరించాడని వైట్ హౌస్ వెల్లడించింది.

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)-పుతిన్ సంభాషణపై అమెరికా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శాశ్వత శాంతితో యుద్ధానికి ముగింపు పలకాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. ట్రంప్ పాలనలో అమెరికా, రష్యా దేశాలు మరింత దగ్గరవుతాయని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చాల్సిన అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.

End of war Donald Trump calls Vladimir Putin

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరుదేశాలు తీవ్రంగా నష్టపోయాయని వైట్ హౌస్ పర్కొంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయని పేర్కొంది. ఆ మొత్తాన్ని ఆయా దేశాల ప్రజల అవసరాల కోసం వినియోగిస్తే ఎంతో మేలు జరిగేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Take a Poll

ఈ వివాదం భవిష్యత్ లో మరలా చెలరేగకూడదని స్పష్టం చేశారు. సమస్యలను సమరస్యంగా పరిష్కరించుకుని ఇప్పటికే యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని వైట్ హౌస్ పేర్కొంది. కాగా, ఇటీవల అమెరికా పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. అయితే, ఈ చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి పురోగతి లేకుండానే సమావేశం నుంచి జెలెన్ స్కీ బయటకు వెళ్లిపోయారు. దీంతో జెలెన్ స్కీ వ్యవహార తీరుపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌కు అందిస్తున్న ఆర్థిక, సాంకేతిక సహకారాలను కూడా నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+