గాజాపై మళ్లీ భీకర దాడులు- కాల్పుల విరమణకు ఇజ్రాయెల్-హమాస్ తూట్లు
దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాజెల్-పాలస్తీనా సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇజ్రాయెల్ భూభాగం లక్ష్యంగా హమాస్ దళాలు ఫైర్ బెలూన్లు వదలడంతో పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
హమాస్ దళాలు తమ దేశంపై ఫైర్ బెలూన్లు ప్రయోగించి అగ్నిప్రమాదాలకు కారణం కావడంతో ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణకు చరమగీతం పాడుతూ దాడులు మొదలుపెట్టేసింది. ఈ ఉదయం నుంచి పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇందులో పలువురు సాధారణ పౌరులు గాయపడ్డారు. హమాస్ ప్రమాదకర పేలుడు పదార్దాలతో నింపిన బెలూన్లు ప్రయోగించడంతో తమ దేశంలో పలు చోట్ల అగ్ని పమాదాలు చోటు చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
https://t.co/Sb14PuvIeU pic.twitter.com/VpmuGSitxK
— افيخاي ادرعي (@AvichayAdraee) June 15, 2021
హమాస్ ప్రధాన నేతలు నివాసం ఉంటున్నారని భావిస్తున్న గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇవాళ ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16 యుద్ద విమానాలు గాజాపై బాంబులవర్షం కురిపిస్తున్నాయి.

Recommended Video
హమాస్ గతంలో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడం వల్లే తాము ఆత్మరక్షణ కోసం దాడులు చేయాల్సి వస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది. మే 21న ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకోవడం ఇదే తొలిసారి. గతంలో ఇరువురి మధ్య ఈజిప్ట్, అమెరికా చొరవతో ఈ ఒప్పందం కుదిరింది.












Click it and Unblock the Notifications