చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Escape: ఎయిర్ పోర్టులో శ్రీలంక మాజీ మంత్రికి సినిమా, భార్యతో మిలటరి స్థావరంలో, దుబాయ్ జంప్ కు స్కెచ్!

|
Google Oneindia TeluguNews

కొలంబో/శ్రీలంక: అర్థిక సంక్షోభం కారణంగా పీకలలోతుల్లో కూరుకుపోయిన శ్రీలంక ప్రజలు ఇంతకాలం అక్కడ అధికారంలో ఉన్న రాజపక్సే బ్రదర్స్ మీద రగిలిపోతున్నారు. రాజపక్సే నలుగురు సోదరుల కారణంగా శ్రీలంక దేశం సర్వనాశనం అయ్యిందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటాబాయ రాజపక్సే దేశం వదిలిపారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి.

శ్రీలంక మాజీ ఆర్థిక మంత్రి, రాజపక్సే సోదరుల్లో ఒకరైన బాసిల్ రాజపక్సే ఆయన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నించడంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని వెలుగు చూసింది. అర్దరాత్రి భార్యతో కలిసి దుబాయ్ వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేసిన శ్రీలంక మాజీ మంత్రి బాసిల్ రాజపక్సే చివరికి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మిలటరి స్థావరానికి వెళ్లి అక్కడ తలదాచుకున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: కాలేజ్ పాఠాలు చెబుతున్న భర్త, హోటల్ లో పోలీసులకు రొమాన్స్ పాఠాలు చెప్పిన భార్య!Illegal affair: కాలేజ్ పాఠాలు చెబుతున్న భర్త, హోటల్ లో పోలీసులకు రొమాన్స్ పాఠాలు చెప్పిన భార్య!

శ్రీలంక పరిస్థితి?

శ్రీలంక పరిస్థితి?

అర్థిక సంక్షోభం కారణంగా పీకలలోతుల్లో కూరుకుపోయిన శ్రీలంక ప్రజలు ఇంతకాలం అక్కడ అధికారంలో ఉన్న రాజపక్సే బ్రదర్స్ మీద రగిలిపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడి భవనంలోకి చొరబడి నానా రచ్చ చేశారు. ఆందోళనకారులను ఏమీ చెయ్యలేక అక్కడి ప్రభుత్వం, మిలటరి సిబ్బంది సైలెంట్ అయిపోయారు.

రాజపక్సే బ్రదర్స్ వల్లే సర్వనాశనం అయ్యింది

రాజపక్సే బ్రదర్స్ వల్లే సర్వనాశనం అయ్యింది

రాజపక్సే నలుగురు సోదరుల కారణంగా శ్రీలంక దేశం సర్వనాశనం అయ్యిందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటాబాయ రాజపక్సే దేశం వదిలిపారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. రాజపక్సే సోదరులు వారి స్వార్థం కోసం అవినీతికి, అక్రమాలకు పాల్పడటంతోనే శ్రీలంక ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆదేశంలోని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

అర్దరాత్రి దుబయ్ పారిపోవాలని స్కెచ్

అర్దరాత్రి దుబయ్ పారిపోవాలని స్కెచ్

శ్రీలంక మాజీ ఆర్థిక మంత్రి, రాజపక్సే సోదరుల్లో ఒకరైన బాసిల్ రాజపక్సే ఆయన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నించారు. అర్దరాత్రి 12.15 గంటల సమయంలో బాసిల్ రాజపక్సే ఆయన భార్య అంతర్జాతీయ విమానాశ్రయంలోని వీఐపీ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారులు బాసిల్ రాజపక్సే పాస్ పోర్టు క్లియర్ చెయ్యడానికి నిరాకరించారని తెలిసింది.

వీవీఐపీలకు చెక్

వీవీఐపీలకు చెక్

శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా వీవీఐపీలు దేశం వదిలి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో శ్రీలంక మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే కూడా ఆయన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని వెలుగు చూసింది.

మిలటరి స్థావరానికి మాజీ మంత్రి

మిలటరి స్థావరానికి మాజీ మంత్రి

వేవకు జామున 3.15 గంటల వరకు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే బాసిల్ రాజపక్సే ఇమ్మిగ్రేషన్ క్లియర్ కాకపోవడంతో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మిలటరి స్థావరానికి భార్యతో కలిసి బాసిల్ రాజపక్సే వెళ్లిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ విమానాశ్రయంలో బాసిల్ రాజపక్సే వేచి ఉన్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటాబాయ రాజపక్సే దేశం వదిలిపారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Escape: Basil Rajapaksa, Sri Lanka's former finance minister, tried to flee to Dubai amid the wave of protests in the country but had to stay back after people at the airport identified him and immigration officers refused to clear his journey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X