Escape: అధికారుల కాళ్లు, చేతులు పట్టుకున్న అధ్యక్షుడు, భార్యతో సింగపూర్ జంప్ జిలాని, ఎంత కష్టం వచ్చింది!
కొలంబో/సింగపూర్: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం కాకుండా ప్రత్యేక విమానంలో సింగపూర్ చెక్కేశారు. ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్న గొటబయ రాజపక్సే సామాన్య ప్రజల దెబ్బతో దొంగచాటుగా శ్రీలంక నుంచి మాల్దీవులు, మాల్దీవుల నుంచి సింగపూర్ కు ఆయన భార్యతో కలిసి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది.
నేనేరాజు, నేనే మంత్రి అంటూ ఇంతకాలం రెచ్చిపోయిన రాజపక్సే బ్రదర్స్ కు ఇప్పుడు కనపడితే సామాన్య ప్రజలు కొట్టిచంపేసే పరిస్థితి ఎదురైయ్యిందని వెలుగు చూసింది. మాల్దీవుల ప్రభుత్వ అధికారులు కాళ్లు, చేతులు పట్టుకున్న గొటబాయ రాజపక్సే ప్రత్యేక విమానం తెప్పించుకుని రహస్యంగా సింగపూర్ వెళ్లిపోయారని అంతర్జాతీయ మీడియా కొడైకూస్తోంది.

రాజపక్సే బ్రదర్స్ అవినీతి, అక్రమాలు!
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే సోదరులు కారణమని శ్రీలంక ప్రజలు మండిపడుతున్నారు. ఇంధన ధరలు పెరిగిపోవడం, ఆహారపదార్థల కోరతకు రాజపక్సే బ్రదర్స్ అవినీతి కారణం అని ఆరోపిస్తూ రాజపక్సే బ్రదర్స్ మీద శ్రీలంక ప్రజలు తిరుగుబాటు చేశారు. శ్రీలంకలో ప్రజల దెబ్బతో రాజపక్సే బ్రదర్స్ అవరుసగా ఆదేశం వదిలిపారిపోయారు.

రాత్రికి రాత్రి జెట్ విమానంలో!
శ్రీలంక ప్రజలు ఆదేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నివాసం ఉంటున్న భవనం చుట్టుముట్టారు. దెబ్బకు భార్యతో కలిసి మిలటరి స్థావరానికి పారిపోయిన గొటబయ రాజపక్సే అక్కడ కొన్ని రోజులు తలదాచుకున్నారు. తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబాయ రాజపక్సే ఆయన భార్య, ఇద్దరు గన్ మెన్ లను వెంటపెట్టుకుని శ్రీలంక మిలటరి జట్ విమానంలో మాల్దీవులు పారిపోయారు.

సింగపూర్ విమానం ఎక్కాలంటే భయపడిన అధ్యక్షుడు
మాల్దీవుల్లో గొటబాయ రాజపక్సేకు నిరసన సెగ తగలడంతో అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోవాలని స్కెచ్ వేశారు. అనుకున్న ప్రకారం బుధవారం రాత్రి మాల్దీవుల నుంచి సింగపూర్ వెలుతున్న SQ 437 విమానంలో గొటబాయ రాజపక్సే ఆయన భార్యతో కలిసి ప్రయాణించవలసి ఉంది. అయితే ప్రజలు, మీడియా దెబ్బకు భయపడిన గొటబాయ రాజపక్సే SQ 437 విమానంలో సింగపూర్ వెళ్లడానికి వెనకడుగు వేశారని ఓ మీడియా సంస్థ వార్తలు ప్రసారం చేసింది.

సింగపూర్ అయినా సేఫ్ గా ఉంటుందా?
గురువారం వేకువ జామున గొటబయ రాజపక్సే ప్రత్యేక విమానంలో ఆయన భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిపోయారని ది రైయిటర్స్ మీడియా వార్తలు ప్రసారం చేసింది. మాల్దీవుల ప్రభుత్వ అధికారులు కాళ్లు, చేతులు పట్టుకున్న గొటబాయ రాజపక్సే ప్రత్యేక విమానం తెప్పించుకుని రహస్యంగా సింగపూర్ వెళ్లిపోయారని అంతర్జాతీయ మీడియా కొడైకూస్తోంది.

నేనేరాజు, నేనే మంత్రి అంటూ పాటుపడిన రాజపక్సే బ్రదర్స్!
శ్రీలంకలో కొన్ని దశాభ్దాలు రాజపక్సే బ్రదర్స్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యిందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. నేనేరాజు, నేనే మంత్రి అంటూ ఇంతకాలం రెచ్చిపోయిన రాజపక్సే బ్రదర్స్ కు ఇప్పుడు కనపడితే సామాన్య ప్రజలు కొట్టిచంపేసే పరిస్థితి ఎదురైయ్యిందని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications