39 మందిని మంచులో గడ్డకట్టించి హత్య చేశారు... ఎస్సెక్స్ ట్రక్కు విషాదం
లండన్‌లోని కంటైనర్‌లో లభించిన 39 మృతదేహాలు లభించిన ఘటనపై దిగ్భాంత్రి కల్గించే అంశాలు బయటపడ్డాయి. కంటైనర్‌లో లభించిన మృతదేహాలన్ని చైనీయులవని చెబుతున్నారు. వీరందరిని గడ్డగట్టించిన మంచులో పెట్టి అంత్యంత దారుణంగా హతమార్చినట్టు చెబుతున్నారు. వారందరిని _25 డిగ్రీల వాతవరణంలో రక్తం గడ్డకట్టేలా ఉంచి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగా మృత దేహాల్లో 38 మంది పెద్ద వయస్సువారు కాగా ఒకరు టీనేజర్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. కాగా జరిగిన సంఘటన సంఘటనపై పూర్తి విచారణ కొనసాగుతోంది.

ఇంగ్లాండ్‌లో దారుణం
23న అక్టోబర్‌న లండన్‌లోని ఓ కంటైనర్‌లో 39 మృతదేహాలు లభించిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే... ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో ఓ పారీశ్రామిక వాడలో అనుమానస్పద స్థతిలో ఉన్న ఉన్న కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 39 మృతదేహాలు లభించాయి. వారిలో 31 మంది పురుషులు ఉండగా, ఎనిమిది మంది మహిళల శవాలు ఉన్నాయి. కాగా ఆ వాహనం బల్గెరీయాలో రిజస్టర్ అయినట్టుగా పోలీసులు తెలిపారు.

శవాల గురించి తెలియదని చెప్పిన డ్రైవర్
దీంతో ఆవాహనం ఓ ట్రాన్స్‌పోర్టు కంపనీకి చెందిందని దాన్ని హోలీహెడ్‌కు చేరుకోవాల్సి ఉందని డ్రైవర్ తెలిపాడు. అయితే అందులో ఉన్న శవాల గురించి తనకు తెలియదని చేతులెత్తేశాడు. పెద్ద ఎత్తున మృతదేహాలు కంటైనర్‌లో లభించడంతో పోలీసులు చాలా సీరీయస్‌గా విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం కూడ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో లభించిన మృతదేహాల వెనక విషాద గాధ బయటపడింది. గడ్డకట్టే మంచులో ఉంచి, వారిని చంపడం దిగ్భ్రాంతిని కల్గిస్తోంది.

డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి
అయితే జరిగిన సంఘటనలో రాబిన్‌సన్ అనే 25 యువ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు. అనంతరం 38ఏళ్ల వయస్సున్న మరో మహిళతో పాటు ఇద్దరిని కూడ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే 2000 సంవత్సరంలో కూడ చైనాకు చెందిన 58మంది మృతదేహాలును డచ్‌కు చెందిన లారీలో డోవర్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. తాజాగా ఇదే తరహాలో మృతదేహాలు లభించడంతో అదే కోణంలో విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications