వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ఆగస్టు నాటికి హెర్డ్‌ ఇమ్యూనిటీ -యూరప్ సాధించబోతోంది -బయోఎన్‌టెక్‌ చీఫ్ ఉగుర్‌ సాహిన్‌

|
Google Oneindia TeluguNews

ఏడాదిన్నరగా యావత్ భూగోళాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 32లక్షల మందిని పొట్టనెపెట్టుకుంది. బుధవారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 15కోట్లకు పెరిగింది. భారత్ లో రెండో దశ వ్యాప్తి విలయం సృష్టిస్తుండగా, యూరప్, అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ఛాయలూ కనిపిస్తున్నాయి. కట్టడి చర్యలతోపాటు వ్యాక్సిన్ల ద్వారానే వైరస్ ను నిరోధించగలమని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. అయితే, వ్యాక్సిన్ల తర్వాత దశ ఏమిటన్నదానిపైనా చర్చ సాగుతోన్న క్రమంలో...

జగన్ బెయిల్ రద్దు: నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు -మే7 డెడ్‌లైన్ -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖజగన్ బెయిల్ రద్దు: నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు -మే7 డెడ్‌లైన్ -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

Serum పూనావాలాకు వై కేటగిరీ భద్రత -vaccine వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం -Covishield ధర తగ్గినాSerum పూనావాలాకు వై కేటగిరీ భద్రత -vaccine వేళ మోదీ సర్కార్ కీలక నిర్ణయం -Covishield ధర తగ్గినా

 4 నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీ

4 నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీ

కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ శరవేగంగా సాగుతోన్న యారప్‌ ఖండం.. రాబోయే నాలుగు నెలల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలదని ప్రఖ్యాత బయోఎన్‌టెక్‌ ఫార్మా సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉగుర్‌ సాహిన్‌ అంచనావేశారు. అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థతో కలిసి బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన 'ఫైజర్‌ వ్యాక్సిన్‌' ప్రపంచంలోనే ఉత్తమ, సమర్థత కలిగిన టీకాగా గుర్తింపు పొందడంతో చాలా దేశాల్లో దానిని విరివిగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

వైరస్ సంక్రమణం ఆగుతుందా?

వైరస్ సంక్రమణం ఆగుతుందా?

ఒక దేశం లేదా ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామూహిక రోగనిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సాధించవచ్చనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జనాభాలో దాదాపు 70శాతానికి పైగా రోగనిరోధకతను సాధిస్తే వైరస్ సంక్రమణను అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నాటికి యూరప్‌ అంతటా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధిస్తుందని బయోఎన్‌టెక్‌ సంస్థ సీఈఓ ఉగుర్‌ సాహిన్‌ అన్నారు. యూరప్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న దృష్ట్యా ఇది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే..

ఏడాదికో బూస్టర్ డోస్ టీకా..

ఏడాదికో బూస్టర్ డోస్ టీకా..

ఫైజర్‌ సంస్థతో కలిసి బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన (ఫైజర్‌) టీకా 95శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలిందని, ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొంతకాలానికే రోగనిరోధక ప్రతిస్పందన తగ్గుతున్నట్లు నివేదికలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మూడో డోసు అవసరం ఏర్పడవచ్చని సాహిన్‌ వెల్లడించారు. తద్వారా వైరస్ నుంచి 100శాతం రక్షణ పొందవచ్చని, అయితే, మొదటి డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవాల్సి ఉంటుందని, ఇలా ప్రతి ఏడాది లేదా 18నెలలకు ఒకసారి బూస్టర్‌ డోసులు తీసుకోవాల్సిన అవసరం వస్తుందని సాహిన్‌ వివరించారు. మరి,

Recommended Video

TS : Include COVID-19 Treatment Under Aargoyasri : Seethakka
భారత్ వేరియంట్‌పై ఫైజర్ ఫైట్?

భారత్ వేరియంట్‌పై ఫైజర్ ఫైట్?

భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం వైరస్‌(B.1.617) వేరింయంట్ ఇప్పటికే 17 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నేపథ్యంలో దానిపై ఫైజర్‌ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందా? అన్న ప్రశ్నకు అవుననే బదులిచ్చారు ఉగుర్‌ సాహిన్‌. భారత్‌ వేరియంట్‌పై ఫైజర్ టీకాను ఇప్పటికే పరీక్షించామని.. అయినప్పటికీ ప్రస్తుత మ్యూటేషన్లపై మరిన్ని పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. ఫైజర్‌ టీకాను భారీస్థాయిలో పంపిణీ చేసిన ఇజ్రాయెల్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని ఆయన గుర్తుచేశారు.

English summary
Europe can achieve herd immunity against the coronavirus within the next four months, Ugur Sahin, the head of German pharmaceutical company BioNTech, which developed the first widely approved Covid-19 vaccine with US partner Pfizer, said Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X