హర్రర్ సినిమా ప్లాన్‌తో పోలీసుల షాక్: భర్త హత్య, ఫేస్‌బుక్ తో ఇలా జంప్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఫ్లోరిడా: చేసిన తప్పును కప్పి పుచ్చుకొనేందుకు మరో తప్పు చేస్తుంటారు. అదే తరహలో అమెరికాకు చెందిన ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఆ తప్పునుండి తప్పించుకొనేందుకు గాను మరో తప్పు చేసింది. తన పోలికలతో ఉన్న మరో మహిళను హత్య చేసి ఆమె స్థానంలో తాను వెళ్ళాలనుకొంది. అయితే ఎట్టకేలకు ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. నిందితురాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సినిమాల్లో చూపినట్టుగానే అమెరికాకు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేసి ఆ ఘాతుకాన్ని మరో మహిళపై నెట్టివేసేందుకు పకడ్బందీగా ప్లాన్ వేసింది. అంతేకాదు ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని ఆ మహిళను దారుణంగా హతమార్చింది. అయితే ఎట్టకేలకు నిందితురాలిని పోలీసులు గుర్తించారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

జూదానికి బానిసగా మారి హత్య

జూదానికి బానిసగా మారి హత్య

అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన లోయిస్ రైస్, డేవిడ్‌లకు ముగ్గురు పిల్లలు. గత నెలలో వీరు కన్పించకుండాపోయారు. అయితే సన్నిహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు ఫామ్‌హౌస్‌లో డేవిడ్ మృతదేహన్ని గుర్తించారు. అయితే జూదానికి బానిసగా మారిన అతని భార్యే డేవిడ్‌ను హత్యచేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో మహిళను హత్య చేసిన నిందితురాలు

మరో మహిళను హత్య చేసిన నిందితురాలు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని లీ కౌంటీలో తనలాంటి పోలికలతో ఉన్న పమేలా హచిన్సన్‌తో లోయిస్ స్నేహన్ని పెంచుకొంది. భర్త డేవిడ్‌ను హత్య చేసిన లోయిస్ ఆ హత్య కేసు నుండి తప్పించుకొనేందుకు ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే తనదైన పోలికలతో ఉన్న పమేలా హచిన్సన్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొంది. ఆదివారం నాడు పమేలాను హతమార్చింది.

గుర్తింపు మార్చుకోవడం కోసమే

గుర్తింపు మార్చుకోవడం కోసమే

భర్త డేవిడ్‌ను హత మార్చిన కేసు నుండి తప్పించుకొనేందుకు లోయిస్ పథకం ప్రకారం వ్యవహరించింది. ఇందులో భాగంగానే తన లాంటి పోలికలు ఉన్న పమేలా హచిన్సన్‌ను హతమార్చింది. డేవిడ్‌ను హత్య చేసిన తర్వాత ఆమెను కూడ గుర్తు తెలియని వ్యక్తులు దోపిడికి వచ్చి హత్య చేశారని అనుమానం కల్గించేలా సీన్ క్రియేట్ చేసింది. పమేలా హచిన్సన్‌కు గుర్తింపుకు సంబంధించిన ఆధారాలతో పాటు విలువైన వస్తువులను తీసుకొని లోయిస్ పారిపోయింది.

షాకైన పోలీసులు

షాకైన పోలీసులు

లోయిస్ రెండు హత్యలు చేయడాన్ని ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసులు గుర్తించారు. సినిమాల్లో మాత్రమే ఈ తరహ ఘటనలు చోటు చేసుకొంటాయని పోలీసు అధికారులు ప్రకటించడం గమనార్హం. లోయిస్ చిరునవ్వు వెనుక ఈ తరహ క్రూరత్వం ఉంటుందనుకోలేదని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chilling new surveillance footage shows Lois Riess, 56, chatting to Pamela Hutchinson, 59, at the Smokin’ Oyster Brewery in Fort Myers, Fla, on April 5.Cops fear Riess befriended Pamela hours before shooting her ‘right through the heart’, with Pamela’s body discovered the next day.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి