ఢాకా పేలుళ్లు: మాజీ ప్రధాని కుమారుడికి జీవితఖైదు, 19మందికి మరణశిక్ష

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తరీఖ్‌ రెహ్మాన్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఆ దేశ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2004లో ఢాకాలో జరిగిన గ్రనేడ్‌ పేలుళ్ల కేసులో ఆయన దోషిగా తేలడంతో బుధవారం ఈ మేరుకు తీర్పు వెలువరించింది.

14ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ ర్యాలీ నిర్వహిస్తుండగా గ్రనేడ్‌ దాడి జరిగింది.
ఈ ఘటనలో 24 మంది మృతి చెందగా మరో 500మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనలో గాయపడిన వారిలో ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా కూడా ఉన్నారు. తీవ్రగాయాల పాలైన ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

 Ex-Bangladesh PM Khaleda Zias Son Gets Life For 2004 Grenade Attack

ఈ ప్రమాదంలో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని జిల్లూర్‌ రెహ్మాన్‌ భార్య ఇవీ రెహ్మాన్‌ మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ జరపగా ఇందులో తరీఖ్‌ హస్తం ఉందని తేలింది. దాదాపు 14ఏళ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసును ఆ దేశ న్యాయస్థానం గత నెల 18న విచారణ పూర్తి చేసింది.

కానీ, తీర్పును మాత్రం అక్టోబర్‌ 10 వరకు రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు చెబుతున్న సమయంలో దేశ రాజధానిలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢాకా మొత్తం మీద 4,000మంది భద్రతా బలగాలను మోహరించారు.

19మందికి మరణశిక్ష

బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్‌ఫోజ్మన్ బాబర్‌కు గ్రెనేడ్ దాడి కేసులో స్థానిక కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి బాబర్‌తో పాటు మరో 19 మందికి ఆ కేసులో మరణశిక్షను ఖరారు చేశారు. తీర్పు సందర్బంగా స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి షెహజాద్‌ నురుద్దిన్‌ ఆ సంఘటనను వివరిస్తూ.. ఈ నిందితులు ఇక జీవించే హక్కు లేదని ఉద్విగ్నభరితంగా తీర్పులు వెలువరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+