• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టూ మచ్ సెక్స్.. తట్టుకోలేకపోతున్నాం.. లాక్ డౌన్ ఎత్తివేయండి.. అధ్యక్షుడికి మహిళ విజ్ఞప్తి

|

లాక్ డౌన్ వేళ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. పని లేక ఇళ్లల్లో ఖాళీగా ఉన్న పురుషులు 'టూ మచ్ సెక్స్' డిమాండ్ చేస్తున్నారని ఓ ఆఫ్రికా మహిళ ఏకంగా దేశాధ్యక్షుడికే ఓ విజ్ఞప్తి చేసింది. పురుషుల సెక్స్ కోర్కెలు తీర్చలేక తీవ్ర వేధింపులకు గురవుతున్నామని.. దయచేసి లాక్ డౌన్ ఎత్తివేయడమో లేదా పురుషులను పనులకు అనుమతించడమో చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె వీడియోను పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది.

పొద్దస్తమానం అదే పని...

పొద్దస్తమానం అదే పని...

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాలు లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. అందులో ఆఫ్రికన్ దేశమైన ఘనా ఒకటి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇక్కడ లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా కంపెనీలు,పరిశ్రమలన్నీ మూతపడటంతో పురుషులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పురుషులు ఎక్కువ శాతం ఖాళీ సమయాన్ని 'సెక్స్' కోసమే వెచ్చిస్తున్నారట. పొద్దస్తమానం అదే పనిగా శృంగారం కోసం ప్రాణం తీస్తున్నారట. ఆఫ్రికన్ మహిళలందరి ప్రతినిధిగా తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసింది.

ఇంతకీ ఆమె ఏం చెప్పింది...

ఇంతకీ ఆమె ఏం చెప్పింది...

ఏప్రిల్ 11న ఘనాలోని MMA అనే వెబ్ సైట్ మొదట ఆమె కథనాన్ని ప్రచురించింది. ఆ వీడియోలో స్థానిక భాషలో ఆమె వెల్లడించిన విషయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. ఆ కథనం ప్రకారం.. లాక్ డౌన్ పీరియడ్‌లో ఆమె భర్త నిత్యం విపరీతమైన శృంగారాన్ని కోరుకుంటున్నాడు. పొద్దస్తమానం శృంగారం కోసం వెంపర్లాడే అతని కోర్కెలను తీర్చలేక.. ఆమె లాక్ డౌన్ ఆదేశాలను సైతం ధిక్కరించి తన ఇంటి నుంచి పారిపోయి వర్క్ ప్లేస్‌కి చేరుకుంది. అక్కడే ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టింది. 'నిద్ర లేచీ లేవగానే సెక్స్ కోసం కాచుకుని ఉన్న భర్తను చూడాలి. వంట తర్వాత,తిన్న తర్వాత,కాసేపు టీవీ చూశాక,ఇలా ఏమాత్రం గ్యాప్ దొరికినా సెక్స్ కావాలంటాడు. లాక్ డౌన్ అనేది సెక్స్ కోసం పెట్టలేదు, వైరస్‌ నుంచి రక్షించడానికి పెట్టింది. కానీ ఇక్కడ మా భర్తలు మమ్మల్ని విపరీత శృంగారం కోసం డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దేశ అధ్యక్షులు దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని లాక్‌డౌన్ ఎత్తివేయాలి లేదా పురుషులను పనికి అనుమతించాలి' అని విజ్ఞప్తి చేసింది.

తన ఒక్కరి బాధ మాత్రమే కాదని..

తన ఒక్కరి బాధ మాత్రమే కాదని..

తాను లాక్ డౌన్‌ ఆదేశాలను ధిక్కరిస్తున్నానని తెలుసని.. కానీ భర్త సెక్స్ కోర్కెలను తట్టుకోలేక ఇంటి నుంచి బయటపడక తప్పలేదని ఆమె వాపోయారు. ఇది తన ఒక్కరి ఆవేదన మాత్రమే కాదని.. ఘనాలో చాలామంది మహిళల పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. మహిళలు ఆమె ఆవేదన పట్ల సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందిస్తుండగా.. పురుషులు ఫన్నీ పోస్టులతో సెటైర్స్ వేస్తున్నారు.

  కండోమ్ చిరిగింది.. కాపురంలో చిచ్చు పెట్టింది
  భారత్‌లోనూ గృహ హింస కేసులు

  భారత్‌లోనూ గృహ హింస కేసులు

  లాక్ డౌన్ వేళ ఇటు భారత్‌లోనూ మహిళల నుంచి గృహ హింస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ ఒక వాట్సాప్ నంబర్ (7217735372 )ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు. ఒత్తిడిలో ఉన్న లేదా గృహ హింసకు గురైన మహిళలకు జాతీయ మహిళా కమిషన్ సహాయసహకారాలు అందిస్తుంది. లాక్ డౌన్ పీరియడ్ వరకు మాత్రమే ఈ నంబర్ అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత దీన్ని తొలగిస్తామని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

  English summary
  Perturbed over the never-ending demand for sex from their partners during the lockdown, women in Ghana are requesting their president Nana Addo to either end the lockdown or allow men to go out for work.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X