వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్ విజృంభ‌ణ వేళ‌..క్లాత్ మాస్క్ సురక్షితమేనా..?ప్రమాదం ఎంత? ..ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివర్సిటీ సంచలన వాస్తవాలు

|
Google Oneindia TeluguNews

మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దాటికి ప్రపంచ దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ఫస్ట్, సెకండ్ వేవ్‌ల‌తో పోల్చితే ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒకవైపు కరోనా , మరోవైపు ఒమిక్రాన్ వైర‌స్ సోకి లక్ష‌లాది మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అటు మ‌ర‌ణాల సంఖ్య కూడా రోజుకు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంగుతున్నారు. తమ పౌరులను రక్షించుకునేందు ఆయా దేశాలు ఆంక్ష‌ల‌ వైపు వెళ్తున్నాయి. కరోనా నిబంధనలు కఠినతరం చేశాయి.

మాస్క్ మ‌స్ట్..

మాస్క్ మ‌స్ట్..


ఈ కరోనా కట్టడికి మాస్క్ దరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, టీకాలు వేసుకోవడం తప్పని సరి అని ప్రభుత్వాలు ఆదేశించాయి. ఇంట్లో నుంచి బయటకి వచ్చేటప్పుడు ప్రజలంతా మాస్కులు మస్ట్ గా ధరించాలని, లేకుంటే పెను ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రపంచాన్ని ఒమిక్రాన్ చుట్టేస్తున్న నేపథ్యంలో ఎలాంటి మాస్కులు ధరించాలి.. క్లాత్ మాస్కులు వాడవచ్చా.. లేదా.. ఎన్ని లేయర్‌ మాస్క్ వాడాలి.. అన్న దానిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో మరోసారి మాస్కులపై చర్చ ప్రారంభమైంది..

క్లాత్ మాస్కులు వాడితే..

క్లాత్ మాస్కులు వాడితే..

సాధారణంగా క్లాత్ మాస్కులు రక రకాల వస్త్రంలో తయారు చేస్తారు. చూడడానికి ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. అయితే అవి కరోనా కట్టడి చేస్తాయని నూటికి నూరు శాతం చెప్పలేం అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్ హాల్గ్ తెలిపారు. సాధారణ క్లాత్ తో తయారు చేసినవి ఎటువంటి హెల్త్ స్టాండర్స్ ను పాటించవని పేర్కొన్నారు.

 ర‌క్ష‌ణ కాదు..

ర‌క్ష‌ణ కాదు..

చాలా మంది రీయూజబుల్ క్లాత్ మాస్కులు ధరిస్తున్నారు. వాటినే మళ్లీ ఉతుక్కొని వేసుకుంటున్నారని.. అలాంటి వారు జాగ్రత్తులు పాటించాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ విజృంభ‌ణ‌ వేళ క్లాత్ మాస్క్ లు అంత రక్ష‌ణ కాదని ఆక్స్ ఫర్డ్ వైద్యనిపుణులు పేర్కొన్నారు.

ఎన్ 95 మాస్కులు

ఎన్ 95 మాస్కులు


అయితే మిక్స్ డ్ మెటిరియల్ తో తయారు చేసే డుబుల్, ట్రిపుల్ లేయర్ మాస్క్ లు వైరస్ కట్టడికి సమర్ధవంతంగా పనిచేస్తాయని ట్రిష్ గ్రీన్ హాల్ పేర్కొన్నారు. ఎన్-95 లాంటి మాస్కులను 95 శాతం క్రిములు, వైరస్ లను అడ్డుకునేలా తయారు చేస్తారని తెలిపారు. అందుకే వైద్యులు ఎక్కువ‌గా ఎన్- 95 మాస్కులను ధరించమని సూచిస్తుంటారని పేర్కొన్నారు.

ముక్కు, నోరును మాస్క్‌తో కవర్ చేయాలి..

ముక్కు, నోరును మాస్క్‌తో కవర్ చేయాలి..


ముఖానికి మాస్కు ధరించినప్పుడు ఫిల్డరేషన్ జరగాలన్నారు. ముక్కు, నోరును మాస్క్ తో కవర్ చేయాలని ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్ హాల్గ్ సూచించారు. మాస్క్ పెట్టుకున్నప్పుడు సులభంగా శ్వాస పీల్చుకునేలా ఉండాలన్నారు. సింగిల్ లేయర్ మాస్కులు ఒమిక్రాన్ వైరస్ ను అరికట్టలేవని పేర్కొన్నారు. ట్రిపుల్ లేయర్ మాస్క్ లను వాడడం ఉత్తమని సూచించారు.

మూల్యం చెల్లించుకుంటున్న బ్రిట‌న్, అమెరికా

మూల్యం చెల్లించుకుంటున్న బ్రిట‌న్, అమెరికా

ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాప్తి చెందడంతో తప్పని సరిగా మాస్కును ధరించాలని ప్ర‌పంచ దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. ఎలాంటి మాస్కులు ఎంచుకోవాలన్న దానిపై కూడా పలు సూచనలు చేస్తున్నాయి. మాస్కులు ధరించపోతే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో బ్రిటన్ , అమెరికాలే ఉదాహరణ. గతంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ నిబంధనలను సడలించింది. అయితే ఇప్పడు మళ్లీ కరోనాతో పాటు ఒమిక్రాన్ వైరస్ ఆ దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రోజుకు లక్ష‌ల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఆ దేశాలు మాస్కు ధరించడం తప్పనిస‌రి చేశాయి.

English summary
Expert Say Cloth Mask May not safe protect against Omicron
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X