ఫేస్ బుక్ లో ఆరోపణల పర్వం... రూ.3 కోట్ల జరిమానా విధించిన కోర్టు
తప్పుడు ఆరోపణలతో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి ఓ వ్యక్తి పరువుకు భంగం కలిగించిన ఓ మహిళకు రూ.3.24 కోట్ల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినాలోని కోర్టు తీర్పు చెప్పింది.
న్యూయార్క్: తన పాత స్నేహితుడే తన కొడుకును చంపాడని ఆరోపిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన మహిళకు రూ.3.24 కోట్ల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినాలోని కోర్టు తీర్పు చెప్పిన ఉదంతమిది.
యాష్ విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మండ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని తాను చంపలేదని ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకును చంపాడని ఆరోపించింది.

దీనిపై డైట్ కోర్టుకెక్కాడు. జాక్వెలిన్ హమ్మండ్ పై అతడు పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును అప్పటి నుంచి విచారిస్తున్న కోర్టు తాజాగా హమ్మండ్ ను దోషిగా ప్రకటించింది. ఈమేరకు ఆమెకు జరిమానా విధించింది.
జాక్వెలిన్ హమ్మండ్ తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని డైల్ పేర్కొన్నాడు. ఆ ఆరోపణలు తన మనసును తీవ్రంగా కలచివేశాయని వ్యాఖ్యానించాడు. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసే వారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠం అవుతుందని డైల్ తరపున కేసును వాదించిన లాయర్ పేర్కొన్నాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications