వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ పేరులో 'ఐసిస్': యువతికి ఫేస్‌బుక్ షాకింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థ సంక్షిప్త నామం ఐసిస్ (ఐఎస్ఐఎస్). ఓ యువతి పేరులో ఐసిస్ ఉండటంతో ఆమె చేదు అనుభవం ఎదుర్కోవలసి వచ్చింది. ఆ యువతి పేరును చూసి... ఉగ్రవాదిగా భావించిన ఫేస్‌బుక్‌ నిర్వాహకులు అతని ఖాతాను డీయాక్టివేట్‌ చేశారని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ఆమె ట్విట్టర్లో స్పందించడం, దానికి ఫేస్‌బుక్ క్షమాపణలు చెప్పి పునరుద్ధరించడం కూడా జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఐసిస్‌ యాంకలే అనే యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఇటీవలే ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచింది.

'Facebook thinks I'm a terrorist': woman named Isis has account disabled

ఆమె పేరులో 'ఐసిస్‌' ఉండటంతో ఆమె ఖాతను ఫేస్‌బుక్‌ యాజమాన్యం తొలగించింది. గత సోమవారం యాంకలే తన ఫేస్‌బుక్‌ ఖాతాను ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించగా డీయాక్టివేట్‌ అని మెసేజ్‌ వచ్చింది. దీంతో మెసేజ్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి ఆ ఫోటోని ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

తన పూర్తి పేరు ఐసిస్‌ యాంకలే అని, తన ఫేస్‌బుక్‌ ఖాతాను ఎందుకు డీయాక్టివేట్‌ చేశారంటూ ప్రశ్నించింది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌‌కి తెలియజేసింది.

ఫేస్‌బుక్‌ తనను ఒక ఉగ్రవాదిగా భావిస్తోందని, తన పాస్‌పోర్ట్‌ని కూడా ఫోటో తీసి పంపానని, తన ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌ ద్వారా కోరారు. దీనికి ఫేస్‌బుక్‌ సిబ్బంది స్పందించి.. కావాలని డీయాక్టివేట్‌ చేయలేదని, పొరపాటుగా జరిగిందని, పునరుద్ధరించామని వివరణ ఇచ్చారు.

English summary
Isis Anchalee, a San Francisco-based engineer, claims to have had her Facebook account disabled because of her name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X