టర్కీలో సైనిక తిరుగుబాటు: ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ నిలిపివేత

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్తాంబుల్: శుక్రవారం టర్కీలో సైన్యం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. సైనిక తిరుగుబాటుతో టర్కీలో సైనికులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింతగా పెరగకుండా ఉండేందుకు టర్కీ ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసింది.

శుక్రవారం రాత్రి 11.04 గంటల ప్రాంతంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సైట్లను టర్కీ ప్రభుత్వం బ్లాక్ చేసిందని, ఆ తర్వాత మరో గంటన్నరకే వాటి సేవలను పునరుద్ధరించారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఈ సంస్థలు తమ వెబ్‌సైట్లను బ్లాక్ చేయడం వెనుకున్న కారణాలను వెల్లడించాయి.

తమ వెబ్‌సైట్‌ను నిలిపివేయలేదని ట్విట్టర్ పేర్కొంటే, కొంతసేపు తమ సేవలు డౌన్‌ అయ్యాయని యూట్యూబ్ పేర్కొనడం విశేషం. ప్ర‌స్తుతం వాటి సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని స‌ద‌రు సంస్థ‌లు పేర్కొన్నాయి. కాగా టర్కీలో సైనిక చర్యను ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ ఖండించిన సంగతి తెలిసిందే.

సైనిక‌ తిరుగుబాటు కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది పోలీసులు సహా 60 మంది మృతి చెందారు. 754 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టర్కీలో సైనిక తిరుగుబాటు బెడిసికొడుతోంది. తిరుగుబాటు సైనికులను ప్రజలు, పోలీసులు ఎక్కడికక్కడ బంధిస్తున్నారు.

దీంతో దేశంలో పలుచోట్ల సైనికులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. టర్కీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు 1960, 1971, 1980, 1993లో సైనిక తిరుగుబాటు జరిగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Turkish military has deployed in Istanbul and Ankara, and the government has apparently blocked social media in response to what is being reported as an attempted coup.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి