వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ను ఇలా హతమార్చారు...వీడియోను చూస్తే ట్విస్ట్ తెలుస్తుంది

|
Google Oneindia TeluguNews

జనవరి 3న ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సమీపంలో ఇరాన్ ఆర్మీ చీఫ్‌ను వైమానిక దాడులతో అగ్రరాజ్యం అమెరికా మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. డ్రోన్లతో జరిపిన ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీ దుర్మరణం చెందారు. ఖాసింపై దాడి చేసిన వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఒక ఫేక్ వీడియోగా తెలుస్తోంది. ఫేస్‌ బుక్ నుంచి వాట్సాప్ వరకు ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంపై వీడియో వైరల్ అవుతోంది. ఖాసింను అమెరికా ఇలా అంతమొందించిందంటూ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

టార్గెట్ అమెరికా: ఇరాన్ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి.. యుద్ధం ప్రారంభమైందా..?టార్గెట్ అమెరికా: ఇరాన్ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి.. యుద్ధం ప్రారంభమైందా..?

బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ వీడియో ఫుటేజీ లో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో కాన్వాయ్ రావడం, కాన్వాయ్ రాగానే అమెరికా వైమానిక దాడులు కొన్ని సెకన్ల వ్యవధిలోనే చేయడం... ఆ తర్వాత కాన్వాయ్‌లోని కార్లు పేలిపోవడం వంటివి కనిపిస్తాయి. అంతేకాదు పక్కనే ఉన్న మనుషులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయడం కూడా కనిపిస్తుంది. అయితే ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వారిపై కూడా దాడులు చేసి హతమార్చడం వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తుంది.

Fake video circulates on social media showing US attack on Qasim Soleimani

" అమెరికా సులేమానీపై జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన వీడియో. ప్రాణాలు కాపాడేందుకు పరుగులు తీస్తున్న వారిని కూడా అమెరికా సైన్యం విడిచిపెట్టలేదు" అనే పోస్టును రాసి ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ వీడియో ఫేక్ వీడియో అని తెలుస్తోంది. సులేమనీని హతమార్చేందుకు అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన వీడియో ఇది కాదని మొదటి ఫ్రేమ్ చేస్తే అర్థమవుతుంది. ఇది రియల్ వీడియో కాదని బైట్ కన్వేయర్ స్టూడియోస్ రూపొందించిన స్టిములేషన్ గేమ్‌ అని తర్వాత తెలిసింది. వీడియోను ట్వీట్ చేసిన వ్యక్తి పూర్తి వీడియోలో నుంచి కొంత కట్ చేసి దాన్ని పోస్టు చేసి వైరల్ చేశాడని తెలుస్తోంది.

English summary
A video is being shared on social media with a claim that it shows footage of the American airstrike on Iranian commander Qasem Soleimani in Baghdad, Iraq. The claim, however, is false.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X