వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం: వుహన్ నుంచి హాంకాంగ్‌కు, వైరస్‌తో ఒకరి మృతి, పోరాడేందుకు ముందుకొచ్చిన అమెరికా

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. చైనాలోని వుహన్‌లో వెలుగుచూసిన వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో ఇప్పటికే 425 మంది మృతిచెందారు. వైరస్ సోకిన వారి సంఖ్య 20 వేల 400 మంది కాగా.. ఇందులో 3 వేల 235 కొత్త కేసులు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాఉంటే చైనా నుంచి మరో రెండు నగరాలకు కూడా వైరస్ వ్యాపించింది. హంకాంగ్‌లో ఒకరు వైరస్ వల్ల చనిపోయారు. తైవాన్‌లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Recommended Video

Coronavirus : Andhra Girl Jyothi Seeking For Help In China | పది రోజుల్లో పెళ్లి.. ఇంతలో చైనా వెళ్లి

 కరోనా వైరస్ నంబర్ 2: దైవభూమిలో రెండో కేసు, ఐసోలేషన్ వార్డులో చికిత్స, మరో 70 మందికి కూడా.. కరోనా వైరస్ నంబర్ 2: దైవభూమిలో రెండో కేసు, ఐసోలేషన్ వార్డులో చికిత్స, మరో 70 మందికి కూడా..

హంకాంగ్‌లో ఒకరి మృతి

హంకాంగ్‌లో ఒకరి మృతి

హంకాంగ్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి ఒకరు జనవరి 21వ తేదీన చైనాలోని వుహన్ వెళ్లారు. అక్కడినుంచి తిరిగొచ్చాక వైరస్ బారినపడ్డారు. అతనిని వైద్యులు పరీక్షించగా వైరస్ సోనినట్టు గుర్తించారు. మంగళవారం అతను చనిపోయారు. దీంతో వుహన్‌ నుంచి వైరస్ హంకాంగ్‌కు వ్యాపించడమే గాక.. రోగి మృతిచెందడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతన్నారు.

తైవాన్‌లో 10 పాజిటివ్ కేసులు

తైవాన్‌లో 10 పాజిటివ్ కేసులు

వుహన్, హుబీ నుంచి మొదలైన వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. హంకాంగ్‌లో ఒకరు చనిపోగా.. తైవాన్‌లో కూడా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

425 మంది మృతి

425 మంది మృతి

చైనాలో వైరస్ వల్ల మృతుల సంఖ్య 425కి చేరింది. అయితే సోమవారం ఒక్కరోజే 64 మంది చనిపోవడం ఆందోలన కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌పై పోరాడేందుకు ముందుకొస్తున్నామని అమెరికా ప్రకటించింది. వైరస్‌ను సమిష్టిగా కలిసి ఎదుర్కొందామని పిలుపునిచ్చింది. వైరస్‌పై తమతో కలిసి పోరాడేందుకు ముందుకొచ్చిన అమెరికాకు.. చైనా స్వాగతించింది. కరోనా వైరస్ విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.

కేరళలో ఎమర్జెన్సీ

కేరళలో ఎమర్జెన్సీ

మరోవైపు కేరళలో కూడా మరో కరోనా కేసు నమోదైంది. మూడు కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రకటించింది.
కరోనా వైరస్ సోకిన కేరళ వాసి రోగి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.

English summary
39-year-old man in Hong Kong who was being treated for the novel coronavirus has died, medical authorities confirmed Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X