ఆర్మీ పైప్ లైన్ ధ్వంసం చేసిన ఉగ్రవాదులు
కొలంబియా: ఉగ్రవాదులు ఆర్మీతో పాటు ప్రజల మీద ప్రతీకారం తీర్చుకొవడానికి తెగించారు. అతి పెద్ద అయిల్ పైప్ లైన్ ధ్వంసం చేసి ప్రజల జీవితాలతో చెలగాటం అడుకున్న సంఘటన కొలంబియాలో జరిగింది. అయిల్ లీకేజీని అదుపు చెయ్యడానికి ఆర్మీ అధికారులు శ్రమిస్తున్నారు.
కొలంబియాలో ఆర్మీకి చెందిన అతి పెద్ద ఆయిల్ పైప్ లైన్ ఉంది. రెవల్యూషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్ఏఆర్ సీ) సంస్థకు చెందిన తిరుగుబాటుదారులు ఒకే రోజు రెండు సార్లు ఆర్మీకి చెందిన పైప్ లైన్లను ధ్వంసం చేశారు.

విషయం గుర్తించిన ఆర్మీ అధికారులు నిపుణులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయిల్ లీకేజ్ ఎక్కువ అయితే ప్రజల ఆరోగ్యంలో మార్పులు వస్తాయని, వారి జీవన విధానం దెబ్బతింటుందని ఆర్మీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ దాడి కారణంగా నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలైనాయి. ఆర్మీ అధికారుల కళ్లు గప్పి మధ్యాహ్నం ఒక సారి, రాత్రి ఒక సారి ఆయిల్ పైప్ లైన్ ను శక్తివంతమైన బాంబులు అమర్చి ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications